Puri Vijay Sethupathi : పూరీ- విజ‌య‌సేతుప‌తి చిత్రానికి విచిత్రమైన టైటిల్‌..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: June 7, 2025, 3:00 pm
  •  Puri Vijay Sethupathi : పూరీ- విజ‌య‌సేతుప‌తి చిత్రానికి విచిత్రమైన టైటిల్‌..!

Puri Vijay Sethupathi  ” ద‌ర్శకుడు పూరి జగన్నాథ్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ఈ ఏడాది జూన్ చివరి వారంలో ప్రారంభం కానుంది.ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ప్రస్తుతం చెన్నై, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లొకేషన్ల వేటలో నిమగ్నమైందని తెలుస్తోంది.

Puri Vijay Sethupathi : పూరీ- విజ‌య‌సేతుప‌తి చిత్రానికి విచిత్రమైన టైటిల్‌..!

Puri Vijay Sethupathi : పూరీ- విజ‌య‌సేతుప‌తి చిత్రానికి విచిత్రమైన టైటిల్‌..!

Puri Vijay Sethupathi  వెరైటీ టైటిల్‌

పూరి జగన్నాథ్ తనదైన శైలిలో, ఓ సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దనున్నారు. విజయ్ సేతుపతి ఇమేజ్‌కు తగ్గట్టుగా ఆయన పాత్రను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం.పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయింది. తొలి షెడ్యూల్‌లోనే విజయ్ సేతుపతితో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొననున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటి టబు, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రలు పోషించనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.

విజయ్ సేతుపతి – పూరి జగన్నాధ్ కాంబోలో సినిమా కోసం ‘బెగ్గర్’ అనే టైటిల్ అనుకున్నారు.. కాని ఇప్పుడు ‘భవతీ భిక్షాందేహి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు . టైటిల్ మూవీ బ‌జ్ క‌లిగించింది. కథకు అనుగుణంగా విజువల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న పూరి జగన్నాథ్, సాంకేతిక అంశాల్లోనూ రాజీ పడకుండా సినిమాను ఉన్నత స్థాయిలో రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp