Home » News » News That Ration Card Holders Must Know
News

Ration Card : రేషన్ కార్డుదారులు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 7, 2025, 2:10 pm
Advertisement

Ration Card : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రేషన్ కార్డుల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తెలంగాణలో నూతన కార్డుల కోసం వేలాదిగా ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇలాంటి నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్‌ను జారీ చేసింది. వారి కార్డులు రద్దు కాకుండా ఉండాలంటే, తప్పనిసరిగా e-KYC ప్రక్రియను జూన్ 30లోపు పూర్తి చేయాలి అని స్పష్టం చేసింది.

Advertisement

Ration Card : రేషన్ కార్డుదారులు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!

Ration Card : మీరు ఇంకా e-KYC చేసుకోలేదా..? అయితే ఈ న్యూస్ చూడాల్సిందే

కేంద్రం తెలిపిన ప్రకారం.. e-KYC ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నకిలీ కార్డులు, మరణించిన వారి పేరిట కార్డులు ఉపయోగించడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మోసాలను అరికట్టడం కోసం ఆధార్ ఆధారిత e-KYCని తప్పనిసరిగా చేస్తోంది. మొట్టమొదటగా మార్చి 31, 2025 గడువు నిర్ణయించినా, సాంకేతిక కారణాలతో అది జూన్ 30, 2025 వరకు పొడిగించారు. గడువు ముగిసిన తర్వాత e-KYC చేయకపోతే కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది.

Advertisement

e-KYC ప్రక్రియను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రూపాల్లో పూర్తి చేయవచ్చు. ఆఫ్‌లైన్ ప్రక్రియలో రేషన్ షాప్ లేదా CSC సెంటర్‌కు వెళ్లి, రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు తీసుకెళ్లి, బయోమెట్రిక్ ద్వారా వెరిఫై చేయాలి. ఆన్‌లైన్ పద్ధతిలో అయితే MyKYC లేదా Aadhaar FaceRD యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తిచేసి, ముఖం స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తి అయిన తర్వాతే మీ రేషన్ కార్డు e-KYC ప్రక్రియ సమాప్తమవుతుంది. కావున, జూన్ 30 వరకు లభ్యమయ్యే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని e-KYC తప్పకుండా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి