Pushpa : ప‌రీక్ష పేప‌ర్‌లో పుష్ప డైలాగ్స్.. అవాక్కైన టీచ‌ర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pushpa : ప‌రీక్ష పేప‌ర్‌లో పుష్ప డైలాగ్స్.. అవాక్కైన టీచ‌ర్

 Authored By sandeep | The Telugu News | Updated on :7 April 2022,4:30 pm

Pushpa : బన్నీ హీరోగా ఈ మధ్య వచ్చిన ‘పుష్ప’ సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలో నే కాదు, ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. హిందీ వెర్షన్ 100 కోట్లకి పైగా రాబట్టడం విశేషం.ఇప్పుడు పుష్ప 2 సినిమా ప్లానింగ్స్ న‌డుస్తున్నాయి. సినిమా కోసం అడవి నేపథ్యంలో సుకుమార్ ఈ కథను రెడీ చేసుకున్నాడు. ముఖ్యమైన పాత్రలను ఆయన డిజైన్ చేసుకున్న తీరు ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించింది. ప్రతి పాత్రకు ఆయన సెట్ చేసిన బాడీ లాంగ్వేజ్ .. మేనరిజమ్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. అలాంటి ఈ సినిమా కోసం బన్నీకి భారీ పారితోషికమే ముట్టిందనే టాక్ వచ్చింది.

అయితే ఈ సినిమా సౌత్‌, నార్త్‌ అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో బన్నీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ మ్యానరిజం, డైలాగ్‌లకు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఎంతలా అంటే.. పుష్ప క్రేజ్‌ ఏకంగా ఖండాంతరాలు దాటేసింది. విదేశీ క్రికెటర్లు సైతం తగ్గేదేలే అంటూ బన్నీ మ్యానరిజాన్ని ఇమిటేట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇక పుష్ప సినిమాకు సంబంధించిన డైలాగ్స్‌ సోషల్‌ మీడియాలో చేస్తున్న సందడి కూడా మాములుగా లేదు. తాజాగా ఓ పదో తరగతి కుర్రాడు చేసిన పని సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

pushpa mania still continues

pushpa mania still continues

Pushpa : పుష్ప మానియా త‌గ్గ‌లే..

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా కోల్‌కతాకు చెందిన ఓ విద్యార్థి ఆన్సర్‌ పేపర్‌లో ఏకంగా పుష్ప డైలాగ్‌ను రాసేశాడు. సమాధానాలకు బదులుగా పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలే’ డైలాగ్‌ను పోలుస్తూ.. ‘పుష్ప, పుష్ప రాజ్‌.. పరీక్ష రాసేదేలే’ అంటూ రాసేశాడు. ఇది చూసిన టీచ‌ర్ ఫోటో తీసి నెట్టింట్లో పోస్ట్‌ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కొందరు పుష్ప మేనియాకు ఇది నిదర్శనమని కామెంట్స్‌ చేస్తుంటే, మరికొందరు మాత్రం పరీక్షా పత్రంలో ఇలా రాయడం తప్పని వాదిస్తున్నారు. సినిమా విడుద‌లై నాలుగు నెల‌లు అవుతున్నా కూడా ‘పుష్ప రైజ్‌’ హంగామా ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది