Pushpa Movie : పుష్ప ఈవెంట్ కి బాలయ్య… ఆచార్య కు ఎన్టీఆర్‌..!

 Authored By kranthi | The Telugu News | Updated on :4 December 2021,7:00 pm

Pushpa Movie : గతంలో మెగా, నందమూరి, ఫ్యామిలీలు పరోక్షంగా ఒకరి మీద ఒకరు గుర్రుగా ఉండేవి. బయట ప్రేక్షకుల ముందు పెద్దగా వివాదాలు సృష్టించుకోకపోయినా.. ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదన్న విషయం సినీ ప్రేక్షకులకు తెలిసిందే. కానీ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నడూ చూడని కాంబోలు దర్శనమిస్తూ ప్రేక్షకులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న పలు ఈవెంట్లు, షో లు.. ఇరు వర్గాలకు పాటు సాధారణ అభిమానుల్లో సైతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అసలు నందమూరి, మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోందోనన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది.

Pushpa Movie : మెగా, నందమూరి ఫ్యామిలీలు ఒక్కటవ్వనున్నాయా..!

ఎప్పుడూ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉండే బాలయ్య అల్లు అరవింద్ కు చెందిన ఆహా ఓటీటీ ద్వారా హోస్ట్ అవతారం ఎత్తడమే పెద్ద ఆశ్చర్యమంటే… ఇటీవల ముఖ్యంగా అఖండ సినిమా ఈవెంట్ ద్వారా జరిగిన పరిణామాలు చూస్తే అవును రెండు ఫ్యామిలీలు ఒక్కటి కానున్నాయి అని అనిపించక మానదు. అఖండ స్టేజీపై బన్నీ హాజరవడం తో టాలీవుడ్ లో సీన్ మొత్తం మారిపోయింది. ఈవెంట్ కు హాజరు కావడమే కాక జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ బన్నీ అరవడం చూస్తూ ఉంటే ఇరు వర్గాల ఫాన్స్ కోరుకుంతున్నట్టే తొందరలోనే రెండు ఫ్యామిలీలు కలిసిపోతాయేమో అనిపిస్తోంది.

pushpa movie pre release evenr balakrishna acharya jr ntr chif guest

pushpa movie pre release evenr balakrishna acharya jr ntr chif guest

Pushpa Movie : పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాబోతున్న బాలయ్య

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రం విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 17 న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్య హాజరు కాబోతున్నారని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అఖండ కోసం తరలి వచ్చిన స్టైలిష్ స్టార్ కోసమే బాలయ్య రాబోతున్నారని మరో వర్గం అంచనా వేస్తోంది. అంతా అనుకుంటునట్టు గానే బాలయ్య గనుక పుష్ప ఈవెంట్ కు తరలి వస్తే… ఎలాగూ మేనల్లుడే కాబట్టి మెగాస్టార్ చిరు కూడా హాజరు అవుతారు కాబట్టి ఆ ఇద్దరూ బడా హీరోలు ఓకే స్టేజీపై ఎదురైనప్పుడు ఏం మాట్లాడుకుంటారు..ఎలా కలిసిపోతారు అని అంతా ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు.

Pushpa Movie : ఆచార్య ఈవెంట్ కు రానున్న జూ. ఎన్టీఆర్..!

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా ముహూర్తం కుదిరింది. త్వరలో నిర్వహించనున్న ఈ ఈవెంట్ కు జూ. ఎన్టీయార్ హాజరు కాబోతున్నారు నెట్టింట్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఆర్.ఆర్.ఆర్ మూవీలో కలసి నటించిన రామ్ చరణ్, తారక్ మధ్య ఉన్న అనుబంధం తోనే.. ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు అతిథిగా హాజరవ్వనున్నారనే టాక్ చక్కర్లు కొడుతోంది. ఇది కూడా జరిగితే ఇక మెగా నందమూరి అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోతాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

kranthi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి