Pushpa Movie Shekhawat : పుష్ప‌లో షెకావ‌త్ పాత్ర‌కి న‌న్నే అనుకున్నారు.. కాని ఏమైందంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pushpa Movie Shekhawat : పుష్ప‌లో షెకావ‌త్ పాత్ర‌కి న‌న్నే అనుకున్నారు.. కాని ఏమైందంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 May 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Pushpa Movie Shekhawat : పుష్ప‌లో షెకావ‌త్ పాత్ర‌కి న‌న్నే అనుకున్నారు.. కాని ఏమైందంటే..!

Pushpa Movie Shekhawat  : తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు.. సీఎం చంద్రబాబు సోదరుడి కుమారుడుగా గుర్తింపు పొందిన రోహిత్.. బాణం మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సోలో (2011), ప్రతినిధి (2014), రౌడి ఫెలో (2014), అసుర (2015), అప్పట్లో ఒకడుండేవాడు (2016) వంటి విలక్షణమైన చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

Pushpa Movie Shekhawat పుష్ప‌లో షెకావ‌త్ పాత్ర‌కి న‌న్నే అనుకున్నారు కాని ఏమైందంటే

Pushpa Movie Shekhawat : పుష్ప‌లో షెకావ‌త్ పాత్ర‌కి న‌న్నే అనుకున్నారు.. కాని ఏమైందంటే..!

Pushpa Movie Shekhawat  అలా మిస్..

ప్రస్తుతం భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మంచు మనోజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మే 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. ఓ ఇంటర్వ్యూలో నారా రోహిత్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చి రికార్డులు కొల్లగొట్టిన పుష్ప చిత్రంలో షెకావ‌త్ పాత్ర నేను చేయాల్సింది. పలు కారణాల వల్ల ఆ ఛాన్స్ మిస్ అయ్యిందని వ్యాఖ్యానించాడు

పుష్ప సినిమాలోని ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ కోసం ముందు అడిగారని.. కొవిడ్‌ సమయంలో మీసాలతో ఒక ఫొటోను సిద్ధం చేసి నాకు పంపారు అని తెలిపారు. నిర్మాత కూడా ఆ పాత్ర గురించి తనతో మాట్లాడారని వివరించారు. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్‌ సైతం చర్చించారని.. అయితే పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయాలి కాబట్టి.. అన్ని భాషల్లో నటులు ఉండాలని ఆ పాత్రలో ఫహాద్ ఫాజిల్‌ను తీసుకున్నారని చెప్పారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది