Pushpa Movie : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప’ ఫిల్మ్.. ఫస్ట్ షో పడేది ఈ థియేటర్స్‌లోనే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pushpa Movie : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప’ ఫిల్మ్.. ఫస్ట్ షో పడేది ఈ థియేటర్స్‌లోనే..

Pushpa Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ ‘పుష్ప’పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ నెల 17న అనగా శుక్రవారం థియేటర్స్‌లో సినిమా విడుదల కానుంది. ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రం తర్వాత బన్నీ చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది.. గతంలో వీరిరువురి కాంబోలో వచ్చిన ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సత్తా చాటాయి. ఇప్పుడు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :16 December 2021,5:00 pm

Pushpa Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ ‘పుష్ప’పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ నెల 17న అనగా శుక్రవారం థియేటర్స్‌లో సినిమా విడుదల కానుంది. ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రం తర్వాత బన్నీ చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది.. గతంలో వీరిరువురి కాంబోలో వచ్చిన ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సత్తా చాటాయి. ఇప్పుడు ‘పుష్ప’ ఏం చేయబోతుందో చూడాలి మరి..ఇకపోతే ఈ సినిమా రిలీజ్‌కు ముందరే రూ.250 కోట్ల బిజినెస్ చేసిందనే కథనాలు మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డెఫినెట్‌గా సూపర్ హిట్ అవుతుందని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సంగతి అలా ఉంచితే..ఏపీలో బెన్ ఫిట్ షోస్ కు అనుమతి లేదని ఏపీ సర్కారు ఇటీవల చట్టం చేసింది. కాగా, తెలంగాణలో మాత్రం బెన్ ఫిట్ షో, ప్రీమియర్‌గా సినిమా వేసుకునే అవకాశం ఉంది. అలా ఈ ‘పుష్ప’ సినిమా ఫస్ట్ షో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో ఉన్న భ్రమరాంభ, మల్లికార్జున థియేటర్స్‌‌లో ‘పుష్ప’ ఫస్ట్ షో పడుతుందని సమాచారం. ఇటీవల విడుదలైన బాలయ్య ‘అఖండ‌’ పిక్చర్ ఫస్ట్ షో కూడా ఈ రెండు టాకీసుల్లోనే వేశారు.

pushpa movie will be premiered in these theatres

pushpa movie will be premiered in these theatres

Pushpa Movie : స్పెషల్ అట్రాక్షన్‌గా సమంత స్పెషల్ సాంగ్.

ఇకపోతే ‘పుష్ప’ ఫిల్మ్ అఫీషియల్ ప్రీమియర్ షో కూడా ఇదే అని అంటున్నారు. ప్రీమియర్ షో చూసేందుకుగాను సుకుమార్‌తో పాటు అల్లు అర్జున్, సినిమా యూనిట్‌ సభ్యులు కొంద‌రు వస్తారని పేర్కొంటున్నారు థియేటర్స్ నిర్వాహకులు. మొత్తంగా బన్నీ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన నటించగా, విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటించారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది