Pushpa : పుష్ప .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మహా ఊరమాస్ గా కనిపించబోతున్న లేటెస్ట్ సినిమా. లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 200 కోట్లని ప్రచారం జరుగుతోంది. ఇంత భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ సినిమా తెరకెక్కడం ఇదే మొదటిసారి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.
pushpa-set-news-are-leaked-by-rashmika-mandanna
ఇక ఇప్పటికే పుష్ప సినిమా ఆన్ లొకేషన్ నుంచి కొన్ని పిక్స్ లీకై మేకర్స్ ని టెన్షన్ పెడుతున్నాయి. ముఖ్యంగా సెట్ లో ఉన్న అల్లు అర్జున్ లుక్స్ కొన్ని ఇటీవల లీకై సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది పుష్ప టైటిల్ తో పాటు ఒకే ఒక్క అల్లు అర్జున్ ఫస్ట్ లుక్. కాని ఆ తర్వాత ఏదో లీక్ వస్తూనే ఉంది. ఆ మధ్య రంప చోడవరం మారేడుపల్లి ఫారెస్ట్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ కి సంబంధించిన కొన్ని పిక్స్ లీకయ్యాయి. ఈ విషయంలో సుకుమార్ యూనిట్ సభ్యులకి వార్నింగ్ కూడా ఇచ్చాడు.
కాగా తాజాగా హీరోయిన్ రష్మిక మందన్న పుష్ప సెట్ లో జరుగుతున్న విషయాలను బయటకి లీక్ చేసింది. తెల్లవారు జామున 5 గంటలకి షూటింగ్ మొదలు పెడుతున్నామని కేవలం మేకప్ చేసుకునేందుకే 2 గంటలు పడుతుందని తెలిపింది. ఇక తెల్లవారు జామున 5 గంటలకి మొదలు పెట్టిన షూటింగ్ సాయంత్రం 7గం.30నిముషాల వరకు సాగుతుందని చెప్పుకొచ్చిందని తెలిపింది. సుకుమార్ ప్రతీ షాట్ ని చాలా పక్కాగా చూసుకుంటున్నాడని .. ఒకరకంగా చాలా కష్టపడుతున్నామని చెప్పుకొచ్చింది. అయితే షూటింగ్ అయిన రష్ చూసుకుంటే ఆరోజంతా పడిన కష్టం అలా ఎగిరిపోతుందని తెలిపింది రష్మిక మందన్న. అంటే పుష్ప సినిమా కి సుకుమార్ దాదాపు 15 గంటలు కేవలం షూటింగ్ కోసమే కేటాయించాడని తెలుస్తోంది.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.