Sudigali Sudheer : పుష్ప‌గా మారిన సుడిగాలి సుధీర్.. యూట్యూబ్‌లో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న స్కిట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sudigali Sudheer : పుష్ప‌గా మారిన సుడిగాలి సుధీర్.. యూట్యూబ్‌లో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న స్కిట్

Sudigali Sudheer : పుష్ప‌.. ఇప్పుడు ఎక్క‌డ చూసిన ఇదే ర‌చ్చ‌. సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్రియులు ఇలా ఒక‌రేంటి ప్ర‌తి ఒక్క‌రు పుష్ప మానియాలో ఊగి తూగుతున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఎంతలా అంటే ఇంటర్నేషన్‌ల్ స్టార్ క్రికెటర్లంతా ఈ మూవీ సాంగ్స్, డైలాగ్స్ ఇమిటేట్ చేసేంత. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీలోని ‘నీ అవ్వ తగ్గేదేలే’ డైలాగ్, ఊ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :28 January 2022,9:30 pm

Sudigali Sudheer : పుష్ప‌.. ఇప్పుడు ఎక్క‌డ చూసిన ఇదే ర‌చ్చ‌. సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్రియులు ఇలా ఒక‌రేంటి ప్ర‌తి ఒక్క‌రు పుష్ప మానియాలో ఊగి తూగుతున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఎంతలా అంటే ఇంటర్నేషన్‌ల్ స్టార్ క్రికెటర్లంతా ఈ మూవీ సాంగ్స్, డైలాగ్స్ ఇమిటేట్ చేసేంత. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీలోని ‘నీ అవ్వ తగ్గేదేలే’ డైలాగ్, ఊ అంటావా మామ, శ్రీవల్లీ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.తెలుగు పాపులర్ కామెడీ షో జబర్దస్త్ లో గత వారం సుడిగాలి సుధీర్ టీమ్ పుష్ప స్పూఫ్ స్కిట్ చేశారు.పుష్ప స్కిట్స్ ఇప్పుడు తెగ సంద‌డి చేస్తున్నాయి.

రీసెంట్‌గా సుధీర్ అల్లు అర్జున్ పుష్ప గెటప్ వేయగా గెటప్ శ్రీను ఫహాద్ ఫాజిల్ చేసిన భన్వర్ లాల్ షెకావత్ గా, రామ్ ప్రసాద్ కేశవ గెటప్ వేయడం జరిగింది. ఈ స్కిట్ లో సుడిగాలి వేసిన జోకులు మాములుగా పేలలేదు. ఎపిసోడ్ హైలెట్ గా నిలిచింది పుష్ప స్కిట్ రికార్డు వ్యూస్ అందుకుంది. కేవలం ఆరు రోజుల్లో సుడిగాలి సుధీర్ స్కిట్ 10 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఇంత తక్కువ సమయంలో కోటి వ్యూస్ అంటే సామాన్యమైన విషయం కాదు.వారు చేసిన స్కిట్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ ని యూట్యూబ్ లో అందుకుంది. కేవలం ఆరు అంటే ఆరే రోజుల్లో ఏకంగా 10 మిలియన్ వ్యూస్ అంటే ఒక కోటి వ్యూస్ తో పాటుగా 2 లక్షలకి పైగా లైక్స్ ని అందుకొని నెవర్ బిఫోర్ రెస్పాన్స్ తో రికార్డు సెట్ చేసింది.

pushpa skit creates wonder Sudigali Sudheer

pushpa skit creates wonder Sudigali Sudheer

Sudigali Sudheer : పుష్ప ర‌చ్చ చేస్తున్నాడుగా..

ఇప్పుడు ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పుష్ప హిందీ వర్షన్ అనూహ్య విజయం సాధించగా అక్కడ ఆయనకు మార్కెట్ ఏర్పడింది. పుష్ప ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించగా సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. మైత్రి మూవీ మేకర్స్ పుష్ప చిత్రానికి నిర్మాతలుగా ఉన్నారు. ఇక పుష్ప విజయం నేపథ్యంలో అల్లు అర్జున్ తో మూవీ చేయడానికి స్టార్ డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది