Raashi Khanna : అందాలు ఓ చోట పేర్చిన ‘రాశి’.. ఈ భామను చూస్తే మతి పోతుందంతే..!
Raashi Khanna: అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశి.. ఆ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. వెండితెరపైన తన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందింది. సినిమాల్లో రాశి ఖన్నా కామెడీ టైమింగ్‌ను ఇష్టపడే ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం. ఇకపోతే రాశి ఖన్నా సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన పర్సనల్ ప్లస్ ప్రొఫెషనల్ విషయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది ఈ భామ. కాగా తాజాగా రాశి ఖన్నా బ్యూటిఫుల్ పిక్ ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది.
Raashi Khanna Latest Pics Viral
Raashi Khanna : పలు భాషల్లో రాణిస్తున్న ముద్దుగుమ్మ..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో రాశి ఖన్నా సూపర్ స్టిల్ ఇచ్చింది. సిల్వర్ కలర్ డ్రెస్ ధరించి ఫొటోకు ఫోజిస్తూ హొయలు పోయింది ఈ భామ. ఇక ఆ ఫొటో చూసి నెటిజన్లు సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ స్టిల్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ‘థాంక్యూ’ ఫిల్మ్‌లోనిది. ఈ చిత్రం కోసం రాశి వెయిట్ లాస్ అయిందని నెటిజన్లు చెప్తున్నారు.
Raashi Khanna Latest Pics Viral
ఈ క్రమంలోనే అందాలను ఓ చోట పేరిస్తే అది రాశి ఖన్నా అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రాశి ఖన్నా టాలీవుడ్, కోలీవుడ్‌లోనే కాదు మాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. రాశి ప్రజెంట్ తెలుగులో ‘పక్కా కమర్షియల్, థాంక్యూ’ చిత్రాల్లో నటిస్తోంది. మలయాళంలో ‘బ్రహ్మమ్’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అంధాదున్’ రీమేక్.
Raashi Khanna Latest Pics Viral
