raashi khanna saree looks viral
Raashi Khanna : క్యూట్ లుక్స్‌తో పాటు మెస్మరైజింగ్ యాక్టింగ్‌తో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్న హీరోయిన్ రాశీ ఖన్నా. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపించింది. ఫలితంగా తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇలా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ నటిస్తోంది. చిన్న వయసులోనే మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన రాశీ ఖన్నా ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఈ మూవీలో బబ్లీ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. నటిగానూ మెప్పించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలను చేస్తూ పాపులర్ అయింది. కెరీర్ ఆరంభం నుంచే చాలా విజయాలను దక్కించుకుంటోన్న రాశీ ఖన్నా.. మధ్యలో కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడింది. అయితే, ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజూ పండగే’తో వరుస హిట్లను అందుకుంది. ఈ క్రమంలోనే ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో ఫ్లాప్‌ను చవి చూసింది. ఇక, ఇటీవలే ఈమె ‘రుద్ర’ అనే సిరీస్‌లో సైకో పాత్రలో అదరగొట్టింది. వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న రాశీ ఖన్నా వరుస ఆఫర్లతో ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈమె తెలుగులో నాగ చైతన్యతో ‘థ్యాంక్యూ’, గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’లో నటిస్తోంది.
raashi khanna saree looks viral
అలాగే, తమిళంలో ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3’, ‘మేథావి’, ‘సైతాన్ కా బచ్చా’.. మలయాళంలో ‘బ్రహ్మమ్’ అనే మూవీలు చేసింది. అలాగే, హిందీలోనూ సినిమాలు చేస్తూనే ఉంది. రాశీ ఖన్నా.. గోపీచంద్‌తో కలిసి ‘పక్కా కమర్షియల్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఆదివారం గోపీచంద్ పుట్టనరోజు సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కూడా రాశీ ఓ కామెడీ లాయర్ పాత్రలో నటించింది. అందుకే పక్కా కమర్షియల్ చిత్రంలో తాను హీరోయిన్ కాదు కమెడియన్ అంటూ వ్యాఖ్యలు చేసింది.అయితే మూవీ రిలీజ్ సందర్భంగా రాశీ ఖన్నా క్యూట్ లుక్స్ లో మెస్మరైజ్ చేసింది. అదిరిపోయే అందాలతో రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బ్లాక్ శారీలో కేక పెట్టించే అందాలతో థ్రిల్ చేస్తుంది. రాశీ క్యూట్ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
This website uses cookies.