Vijayashanti : ఆ హీరో వ‌ల‌న విజ‌య‌శాంతి, రాధ గొడ‌వ ప‌డ్డారా..!

Authored By Sam C | The Telugu News | Published on: September 15, 2022, 5:30 pm

Vijayashanti : ఒక‌ప్పుడు టాలీవుడ్ అగ్ర తార‌ల‌లో విజ‌య‌శాంతి, రాధ త‌ప్ప‌క ఉంటారు. వీరి న‌ట‌న‌తో పాటు డ్యాన్స్ అదుర్స్ అనే చెప్పాలి. చిరంజీవితో క‌లిసి పోటీ ప‌డి డ్యాన్స్ చేసే హీరోయిన్స్‌లో ఈ ఇద్ద‌రి పేర్లు త‌ప్ప‌క ఉంటాయి. దీని వ‌ల్ల‌నో ఏమో కాని అప్ప‌ట్లో రాధ‌, విజ‌య‌శాంతిల‌కు చిరంజీవి స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాలు ఎక్కువ‌గా దొరికేవి. అయితే చిరంజీవి – విజయశాంతి కాంబినేషన్ లో ఓ సూపర్ హిట్ సినిమా వచ్చిన వెంటనే.. రాధా – చిరు కాంబినేషన్లో మరో హిట్ సినిమా వచ్చేసేది. ఈ ఇద్ద‌రు హీరోయిన్స్‌తో చిరంజీవి చేసే సినిమాల‌కు మంచి ఆద‌ర‌ణ ఏర్ప‌డ‌డంతో నిర్మాత‌లు సైతం హీరోయిన్స్ వెన‌క ప‌డుతుండేవార‌ట‌.

Vijayashanti : గొడ‌వెందుకు..

విజ‌య‌శాంతి డేట్స్ ఖాళీగా లేక‌పోతే రాధ డేట్స్, రాధా డేట్స్ ఖాళీగా లేక‌పోతే విజ‌య‌శాంతి డేట్స్ తీసుకునే వాళ్ల‌ట నిర్మాత‌లు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు హీరోయిన్స్ మ‌ధ్య కోల్డ్ వార్ కూడా న‌డిచేద‌ని చెబుతుండేవారు. విచిత్రం ఏంటంటే చిరుకు జోడిగా ఈ ఇద్దరు కలిసి కూడా సూపర్ హిట్ సినిమాలలో నటించారు. అయితే కాల‌క్రమంలో విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి సూపర్ హిట్ కొట్టారు. దీంతో విజ‌య‌శాంతికి లేడి సూపర్ స్టార్ బ్రాండ్ ద‌క్కింది.ఇక రాధా పెళ్లి త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కు దూరంగా కాగా, ఆమె కూతుళ్లు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. కాని వారు పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయారు.

radha and Vijayashanti fight topic in tollywood

radha and Vijayashanti fight topic in tollywood

అయితే అప్పట్లో విజయశాంతి. రాధ మధ్య జరిగిన కోల్డ్ వార్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉండేది. ఇక విజ‌య‌శాంతి చాలా రోజుల త‌ర్వాత మ‌హేష్ బాబు న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో త‌న అభినయంతో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక చిరంజీవి విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్నారు. ఆచార్య చిత్రంతో చివ‌ర‌గా ప‌ల‌క‌రించిన చిరు ద‌స‌రాకి గాడ్ ఫాద‌ర్‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp