Krishnam Raju : కృష్ణంరాజు పిల్లల కోసం చాలా కష్టాలు.. పుత్రకామేష్టి యాగం చేసినా ప్రయోజనం లేదు
Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి తెలుగు సినిమా పరిశ్రమకు మాత్రమే కాకుండా తెలుగు జాతికే తీరని లోటు అంటూ ఎంతో మంది తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నుండి మొదలుకొని ఎంతో మంది కృష్ణంరాజు యొక్క మృతికి సంతాపం తెలియజేశారు. ఈ సమయంలో ఆయనకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కృష్ణంరాజు పిల్లల కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు.. పిల్లలు పుట్టకపోవడంతో పూజలు పునస్కారాలు అంటూ చాలానే చేశారు. కృష్ణంరాజు మొదటి భార్య తో కూడా పిల్లలు కాలేదు. ఆమె పిల్లల కోసం ఎన్నో పూజలు చేసేవారు. మొదటి భార్యతో కలిసి కృష్ణంరాజు పిల్లల కోసం చాలానే ప్రయత్నించారు. కానీ పిల్లలు కలగలేదు. పిల్లలు కాకుండానే కృష్ణంరాజు మొదటి భార్య యాక్సిడెంట్ లో మృతి చెందారు.
ఆ తర్వాత శ్యామలాదేవి ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె కి కృష్ణంరాజుకి దగ్గర బంధుత్వం ఉంది, ఆ బంధుత్వం కారణంగానే ఆమెని కృష్ణంరాజు పెళ్లి చేసుకున్నారు. శ్యామల దేవిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చాలా సంవత్సరాల పాటు కృష్ణంరాజుకి పిల్లలు కలగలేదు. కొడుకుల కోసం పుత్ర కామేష్టి యాగం కూడా చేయించిన కృష్ణంరాజు ఫలితం లేకుండా పోయింది. కృష్ణంరాజుకి ముగ్గురు ఆడపిల్లలే, అందులో ఇద్దరు కవలలు. కృష్ణంరాజు వారసులు లేరని మొదట్లో బాధపడేవారు.. కానీ ప్రభాస్ ని తన సినీ రంగ వారసుడిగా ప్రకటించి, అతడు ఎదుగుతుంటే చాలా సంతోషించేవాడు.
ఇక కూతుర్లు ఎదుగుతూ తన యొక్క గోపికృష్ణ బ్యానర్ లో సినిమాలను నిర్మించేందుకు సిద్ధమవడంతో కృష్ణంరాజు చాలా సంతోషించేవాడు. కొడుకులు లేరు అనే బాధ కృష్ణంరాజుకి చివరి రోజుల్లో లేదని చెప్పాలి. మొదట్లో కృష్ణంరాజు కొడుకులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు కానీ తర్వాత కొడుకుల గురించిన ఆలోచన అతనికి లేదని ఆయన సన్నిహితులు అంటూ ఉండేవారు. పుత్రకామేష్టి యాగం చేస్తే కొడుకులు పుడతారని పండితులు చెప్పడంతో భారీగా ఖర్చుపెట్టి అప్పట్లోనే కృష్ణంరాజు ఆ యాగం నిర్వహించారు. కానీ ఆ యాగం ప్రతిఫలం శూన్యం. కుమార్తెనే మళ్లీ జన్మించింది. కృష్ణంరాజు మరియు శ్యామలాదేవి చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరు కూడా ప్రతి సందర్భంలో కలిసే కనిపించేవారు. సినిమా ఇండస్ట్రీలో కృష్ణంరాజు గురించి అనేక పుకార్లు, షికారు చేసిన శ్యామలాదేవి మాత్రం వాటిని పట్టించుకునే వారు కాదు. కృష్ణంరాజుని అర్థం చేసుకొని ఆయనకు తోడుగా చివరి వరకు నిలిచారు.