Vijayashanti : కళ్యాణ్ రామ్ .. రాముడు లాంటి మంచి బాలుడు – విజయశాంతి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vijayashanti : కళ్యాణ్ రామ్ .. రాముడు లాంటి మంచి బాలుడు – విజయశాంతి

 Authored By ramu | The Telugu News | Updated on :17 March 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Vijayashanti : కళ్యాణ్ రామ్ .. రాముడు లాంటి మంచి బాలుడు - విజయశాంతి

Vijayashanti : నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని , సినిమా ప్రొమోషన్లను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా విజయశాంతి తన అనుభవాలను పంచుకుంటూ, కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా స్పందించారు. ఆయన నిజంగా రాముడిలాంటి మంచి వ్యక్తి అని, షూటింగ్ సమయంలో తనను ఎంతో గౌరవంతో, అప్యాయంగా చూసుకున్నారని ఆమె పేర్కొన్నారు.

Vijayashanti కళ్యాణ్ రామ్ రాముడు లాంటి మంచి బాలుడు విజయశాంతి

Vijayashanti : కళ్యాణ్ రామ్ .. రాముడు లాంటి మంచి బాలుడు – విజయశాంతి

కథ విన్న వెంటనే తాను ఈ ప్రాజెక్ట్ చేయాలనే ఆసక్తి కలిగిందని, సినిమాలో తాను పోషించిన పోలీసాఫీసర్ పాత్ర తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. ముఖ్యంగా కథలో తల్లి-కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాలు, ఎంతో సహజంగా ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాదు ఈ చిత్రంలో తనకు యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందని, దానిని తాను సాహసోపేతంగా పూర్తి చేశానని , ఫైట్ మాస్టర్ సీన్ వివరించగానే తాను టేక్ చెప్పి చేసేశానని, తన యాక్షన్ చూసి యూనిట్ అంతా ఆశ్చర్యపోయిందని విజయశాంతి వివరించారు.

ఈ సినిమా కోసం నిర్మాతలు మంచి బడ్జెట్ వెచ్చించారని, దర్శకుడు ప్రదీప్ చాలా కూల్ గా, అనుభవజ్ఞుడిలా చిత్రాన్ని రూపొందించారని విజయశాంతి ప్రశంసించారు. కళ్యాణ్ రామ్ సినిమా పట్ల చూపించే ప్యాషన్, అతని కమిట్మెంట్ అద్భుతమని, ఎన్టీఆర్ వారసులుగా ఆయన చూపే డెడికేషన్ నిజంగా ప్రేరణదాయకమని పేర్కొన్నారు. ఇక క్లైమాక్స్ లో కళ్యాణ్ రామ్ నటన చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని, సినిమా విడుదలయ్యాక అది సరికొత్త అనుభూతిని అందిస్తుందని అన్నారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..తాను నటించిన అతనొక్కడే విడుదలై 20 అవుతున్న ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ చిత్రం గురించి కూడా మరో 20 ఏళ్లు మాట్లాడుకుంటారని చెప్పుకొచ్చారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది