Health Benefits of asparagus
Health Benefits : ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయి. అయితే మనం సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండే తోటకూరను ఎక్కువగా తింటూ ఉంటాం. అయితే ఎర్ర తోటకూర కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది. ఆకు పచ్చ తోటకూర తో పోలిస్తే ఎర్ర తోటకూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కూరలో విటమిన్ ఏ, సి, బి, కాల్షియం పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, కాపర్, జింక్, ఫైబర్, ఫాస్ఫరస్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వారంలో రెండు సార్లు తోటకూరతో కూర, పప్పు వంటివి చేసుకొని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
తోటకూర తినడం వలన గుండె సంబంధిత సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ ఆకుకూరను ఎక్కువగా తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ ఆకు కూరలో క్యాలరీలు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం వలన బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. అలాగే ఆకు కూరలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన తొందరగా ఆకలి కూడా వేయదు. విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. విటమిన్ కె ఎక్కువగా ఉండడం వలన ఎముకలు గట్టిగా ఉంటాయి.
Health Benefits of asparagus
అలాగే రక్తం గడ్డ కట్టడంలో కీలకపాత్రను పోషిస్తుంది. ఎర్ర తోటకూర తినడం వలన జీవక్రియ రేటు పెరిగి త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అలాగే వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయడమే కాకుండా ముడతలు, మొటిమలు వంటివి లేకుండా ముఖం అందంగా, కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్, జియోక్సంతిన్, లూటిన్ ఉన్నాయి. వీటిలో ఫ్లెవనాయిడ్ పాలీఫెలోనిక్ యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ నుండి ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా చర్మాని కాపాడుతాయి. అలాగే తోటకూరలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. దీనివలన కంటి సమస్యలు రాకుండా చేస్తాయి. ఇన్ని లాభాలు ఉన్న ఎర్ర తోటకూరను వారానికి రెండు సార్లు అయినా కచ్చితంగా తినాలి.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.