Radhe Shyam First Day Collections : రాధేశ్యామ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫుల్‌గా కుమ్మేస్తుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Radhe Shyam First Day Collections : రాధేశ్యామ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫుల్‌గా కుమ్మేస్తుందిగా..!

Radhe Shyam First Collections : అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న రాధే శ్యామ్ సినిమా ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ రావ‌డం అభిమానుల‌ని కాస్త బాధిస్తుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ ప్రీమియర్స్ పరంగా రాధే శ్యామ్ చిత్రానికి సాలీడ్ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ తెలుపుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 7000 వేలకు పైగా స్క్రీన్​లలో ఈ మూవీ విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :12 March 2022,11:00 am

Radhe Shyam First Collections : అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న రాధే శ్యామ్ సినిమా ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ రావ‌డం అభిమానుల‌ని కాస్త బాధిస్తుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ ప్రీమియర్స్ పరంగా రాధే శ్యామ్ చిత్రానికి సాలీడ్ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ తెలుపుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 7000 వేలకు పైగా స్క్రీన్​లలో ఈ మూవీ విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ అంచనాలను అందుకుందా లేదా అనే విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది.

350 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 1000 కోట్లను కలెక్ట్ చేసే దిశగా పరుగులు తీస్తుంది. తొలి రోజు మంచి టాక్ తో రాధే శ్యామ్ సినిమా అన్ని సినిమాల కంటే ముందంజలో ఉంది. ప్రభాస్‌కి ఉన్న డిమాండ్ దృష్ట్యా విడుదలకు ముందుగానే ఆన్ లైన్ టికెట్స్ బాగా అమ్ముడయ్యాయి. యూఎస్ ప్రీమియర్ షోస్ ద్వారా 891K డాలర్స్ వచ్చాయని సమాచారం. అదేవిధంగా హిందీలో కూడా బెటర్‌గా పర్ఫామ్ చేసిన ఈ సినిమా 5 నుంచి 6 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు 30 కోట్ల రూపాయలు కొల్ల‌గొట్టిన‌ట్టు తెలుస్తుంది.ఒక్క హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 6.5 కోట్ల మార్కును క్రాస్ చేయడం,

Radhe Shyam First Day Collections e Shyam Movie in prabhas gets success

Radhe Shyam First Day Collections

Radhe Shyam First Collections : తొలి రోజు అద‌ర‌గొట్టిన‌ట్టేనా..

ఆంధ్రాలో కొన్ని చోట్ల హైర్స్ యాడ్ కావడం ఈ సినిమాకు కాస్త కలిసొచ్చిందనేది ట్రేడ్ పండితుల మాట. రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే కథను కూడా రచించారు. భూఫన్ కుమార్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 350 కోట్ల రూపాయలతో దీనికి నిర్మించారు. తమన్ బ్యాక్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. డాక్టర్ పాత్రలో పూజా హెగ్డే, జ్యోతిష్యుడి పాత్రలో ప్రభాస్ అదరగొట్టారు.ఈ అద్భుతమైన ప్రేమ కావ్యంలో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికుడి పాత్రలో ప్రభాస్ కనిపించగా, పూజా హెగ్డే ప్రేరణ రోల్ పోషించింది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ, ప్రభాస్ నటన ఈ సినిమాలో హైలైట్ అయ్యాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది