Home » Entertainment » Radhe Shyam First Show In Kukatpally
Entertainment

Radhe Shyam : మొద‌లైన రాధే శ్యామ్ సంద‌డి.. ఎన్ని థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నుంది, బెనిఫిట్ షో ఎక్క‌డో తెలుసా?

Authored By
Sam C
The Telugu News | Updated on: March 10, 2022, 9:50 pm
Advertisement

Radhe Shyam : ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన రాధే శ్యామ్ చిత్రం కోసం అభిమానులు కొన్నాళ్లుగా క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ వ‌చ్చారు. ఎట్ట‌కేల‌కు ఈ చిత్రం మార్చి 11న విడుద‌ల కాబోతుంది. ఈ సినిమా తెలుగులో రూ. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయ‌గా, ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్ల ప్రిలీజ్ బిజినెస్ చేసింది. హిట్ అనిపించకోవాలంటే.. రూ. 204 కోట్లు వసూళు చేయాలి. ప్రభాస్ నటించిన గత సినిమాలు బాహుబలి, సాహో మూవీలతో పోలిస్తే చాలా వెనకబడిందనే చెప్పాలి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7010 స్క్రీన్స్‌లో విడుదల కాబోతోంది.రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించనున్నాడు.

Advertisement

ఇక ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చాలా మంది ఆతృతగా చూస్తున్నారు. కానీ అందరికంటే ముందుగా రాధేశ్యామ్ సినిమాను హైదరాబాదీలు చూసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా తొలి ఆటను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో అందరికంటే ముందుగా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.శుక్రవారం నాడు వేకువజాము కంటే ముందుగానే ఈ థియేటర్లో రాధేశ్యామ్ బొమ్మ పడే అవకాశం ఉందట. దీంతో మన దగ్గరే రాధేశ్యామ్ బొమ్మ తొలుత పడుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

radhe shyam first show in kukatpally

Advertisement

Radhe Shyam : ప్ర‌భాస్ మానియా..

అంతేగాక వారు ఈ సినిమాను అందరికంటే ముందుగా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ షోకు సంబంధించిన టికెట్ల కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ట్రై చేస్తున్నారు. తెల్ల‌వారుజామున 3.33నిల‌కు షో ప‌డ‌నుండ‌గా, మ‌రి కొద్ది నిమిషాల‌లోనే రివ్యూ రానుంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న రాధేశ్యామ్ చిత్రానికి సౌత్‌లో జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందించగా, థమన్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించాడు. అటు బాలీవుడ్ వర్షన్‌కు మిథూన్, మనన్ భరద్వాజ్‌లు సంయుక్తంగా మ్యూజిక్ అందిస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి