Radisson Hotel : హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు… చెల్లి మిస్సింగ్ అంటూ అక్క కంప్లైంట్…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Radisson Hotel : హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు… చెల్లి మిస్సింగ్ అంటూ అక్క కంప్లైంట్…!

Radisson Hotel  : కొద్దిరోజులు క్రితం హైదరాబాదు రాడిసన్ లో జరిగినటువంటి చిన్నపాటి రైడింగ్ లో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు చాలామంది దొరకడం జరిగింది. ఇక వారిలో డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నారు. అలాగే instagram ఇన్ఫ్లుయెన్సర్ గా బాగా పేరు తెచ్చుకున్నటువంటి కుషిత కల్లపు చెల్లెలు లిఖిత గణేష్ కూడా ఉన్నారు. అయితే వీరందరి కంటే టాప్ లో ఉన్నటువంటి అబ్బాస్ అనే వ్యక్తి A ముద్దాయిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 March 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Radisson Hotel : హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు...చెల్లి మిస్సింగ్ అంటూ అక్క కంప్లైంట్...!

Radisson Hotel  : కొద్దిరోజులు క్రితం హైదరాబాదు రాడిసన్ లో జరిగినటువంటి చిన్నపాటి రైడింగ్ లో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు చాలామంది దొరకడం జరిగింది. ఇక వారిలో డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నారు. అలాగే instagram ఇన్ఫ్లుయెన్సర్ గా బాగా పేరు తెచ్చుకున్నటువంటి కుషిత కల్లపు చెల్లెలు లిఖిత గణేష్ కూడా ఉన్నారు. అయితే వీరందరి కంటే టాప్ లో ఉన్నటువంటి అబ్బాస్ అనే వ్యక్తి A ముద్దాయిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే అబ్బాస్ ను పోలీసులు ఇంట్రాగేట్ చేసినప్పుడు పలు రకాల విషయాలను బయట పెట్టడం జరిగింది. అయితే ఆ సమయంలో వారు అక్కడ ఏం చేస్తున్నారు అనే దాని గురించి అలాగే ఆ తర్వాత దాని గురించి మీడియాలలో వస్తున్న ప్రచారాలు అలాగే జరిగినటువంటి పరిణామాలలో డైరెక్టర్ క్రిష్ అరెస్టు చేసే ప్రయత్నం కూడా జరిగింది.

కానీ డైరెక్టర్ క్రిష్ తప్పించుకుని వెళ్లి ముంబైలో తలదాచుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇదివరకే మనం చూసాం కానీ ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ ఈ కేసులో కి వచ్చింది అని చెప్పాలి. అదేంటంటే కుషిత కల్లపు తన చెల్లెలు లిశి గణేష్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో పోలీసులు కూడా మిస్సింగ్ కేస్ ఫైల్ చేయడం జరిగింది. అలాగే నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఆమె లేకపోవడంతో నోటీసులు అక్కడ అంటించేసి వచ్చేసారు. కానీ ఇప్పుడు రివర్స్ లో కుషిత తన చెల్లెలు లిఖిత గణేష్ కనిపించడం లేదని చెప్పడాని ఒక డ్రామా లాగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కు పిలుస్తారని ఆమె కనిపించకుండా పారిపోయారనేది పలువురు విశ్లేషకులు చెబుతున్నన్న మాట. అలాకాకుండా నిజంగానే ఆమె మిస్ అయితే మాత్రం వెతకాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. అయితే ఆమె నిజంగా మిస్ అయ్యారా లేక కావాలని ఇలా చేస్తున్నారా అనేది కనిపెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు పోలీసులపై పడింది. అయితే ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ కనిపించకుండా పోయారు. వీరిద్దరూ కూడా ఇన్విస్టిగేషన్ కు రావాల్సి ఉంది. ఇక వీరిద్దరూ కాకుండా నీల్ , శ్వేత అనే వారు కూడా ఉన్నారు.వాళ్లు కూడా ఇన్వెస్టిగేషన్ కి రావాల్సి ఉంటుంది. అయితే అబ్బాస్ అనే వ్యక్తి ఎవరైతే దొరికారో అతను పలు రకాల విషయాలు బయట పెట్టడం జరిగింది. వారంతా అక్కడ కోకెయిన్ తీసుకున్నారని,అతను డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటానని పలు రకాలు విషయాలు బయట పెట్టాడు. ఇలాంటి తరుణంలో ఖుషిత అంత హడావిడిగా వచ్చి మిస్సింగ్ కేసు పెట్టడం అనేది కచ్చితంగా డ్రామా ఆడుతున్నారని అంటున్నారు. తప్పు ఒప్పుకుంటే అయిపోతుంది కదా ఇలా లేనిపోని డ్రామాలు ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు వారి సొంత ఇంట్లో వారితో పాటు వారి బంధువులు కూడా అంటున్న మాట.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది