Raghurama Krishna Raju : సినిమా రిలీజ్ కు ముందే ఔరంగజేబులాంటి వాడిని పవన్ ఓడించాడు.. రఘురామ కీలక వ్యాఖ్యలు
ప్రధానాంశాలు:
Raghurama Krishna Raju : సినిమా రిలీజ్ కు ముందే ఔరంగజేబులాంటి వాడిని పవన్ ఓడించాడు.. రఘురామ కీలక వ్యాఖ్యలు
Raghurama Krishna Raju : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ Pawan Kalyan హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ hari hara veera mallu Movie Review ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా Hyderabad హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కూడా హాజరయ్యారు.

Raghurama Krishna Raju : సినిమా రిలీజ్ కు ముందే ఔరంగజేబులాంటి వాడిని పవన్ ఓడించాడు.. రఘురామ కీలక వ్యాఖ్యలు
Raghurama Krishna Raju పవన్‌పై ప్రశంసలు..
ఈ వేడుకలో రఘురామ మాట్లాడుతూ… ‘ఆంధ్ర రాష్ట్రంలో ఔరంగజేబు లాంటి వాడిని ఓడించి గెలిచిన గొప్ప వ్యక్తి’గా పవన్ కల్యాణ్‌ను అభివర్ణించారు. ఇప్పుడు రీల్ లైఫ్ లోనూ సత్తా చాటేందుకు హరిహర వీరమల్లు చిత్రంతో వస్తున్నాడని అన్నారు. అందరిలాగే తాను కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని రఘురామ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ మంచి నటుడే కాకుండా, వ్యక్తిత్వం పరంగానూ ఎంతో మంచివాడని కొనియాడారు.
నాడు ఛత్రపతి శివాజీ కలలు కన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారన్నది హరిహర వీరమల్లు సినిమా ద్వారా చూడబోతున్నామని వివరించారు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… పవన్ కల్యాణ్ ఎంతో నిజాయతీ ఉన్న వ్యక్తి అని, తాను ఏం చెబుతాడో అదే పాటిస్తారని కొనియాడారు. జాతీయ వాదం ప్రధాన అంశంగా హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోందంటూ ఆయన కామెంట్ చేశారు.
సినిమా రిలీజ్ కు ముందే ఆంధ్రా రాష్ట్రంలో ఔరంగజేబ్ లాంటి వ్యక్తినీ జయించడానికి కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి @PawanKalyan – @KRaghuRaju pic.twitter.com/KMCg0S8jTm
— greatandhra (@greatandhranews) July 21, 2025