Rahul Siplgunj : మస్త్ పైసల్ సంపాదించండి.. రాజశేఖర్ కూతుళ్లపై రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 5 February 2021, 9:42 am

Rahul Siplgunj : రాహుల్ సిప్లిగంజ్‌కు యాంగ్రీ మెన్ రాజశేఖర్‌కు సంబంధం ఏంటి.. వాళ్లపై అలా ఎందుకు కామెంట్ చేశాడు.. పైసల్ సంపాదించండి అని ఎందుకు అన్నాడంటూ ఇలా చాలా ఆలోచనలే వచ్చి ఉంటాయ్ హెడ్డింగ్ చూసి. అయితే అది పూర్తి అర్థం కావాలంటే అసలు మ్యాటర్ తెలియాల్సిందే. ప్రస్తుతం శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్‌లు నిర్మాతలుగా మారారు. తమ తండ్రి నటిస్తోన్న కొత్త సినిమాను శివానీ, శివాత్మికలే నిర్మిస్తున్నారు.

rahul Siplgunj about Shivathmika rajasekhar Shivani rajasekhar

rahul Siplgunj about Shivathmika rajasekhar Shivani rajasekhar

మళయాలి హిట్ సినిమా జోసెఫ్‌ను తెలుగులో శేఖర్‌గా రీమేక్ చేస్తున్నారు. ఇందులో రాజశేఖర్ హీరోగా నటిస్తున్నారు. రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా నిన్న ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అందులో భాగంగా పోస్టర్ బాగా క్లిక్ అయింది. ఆ పోస్టర్‌పై రాహుల్ సిప్లిగంజ్ తనదైన స్టైల్లో కామెంట్ చేశాడు. పోస్టర్ అదిరిపోయిందని చెబుతూ.. వావ్.. నిర్మాతలుగా మస్త్ పైసల్ సంపాదించండని రాహుల్ కామెంట్ చేశాడు.

రాజశేఖర్ కూతుళ్లపై రాహుల్ సిప్లిగంజ్ :Rahul Siplgunj 

రాహుల్ సిప్లిగంజ్.. శివాత్మిక రాజశేఖర్‌లు రంగమార్తాండ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఈ ఇద్దరూ భార్యభర్తలుగా నటిస్తున్నారు. అలా అక్కడ ఏర్పడిన పరిచయంతో బాగానే క్లోజ్ అయ్యారు. అందుకే నిర్మాతగా మారడంతో తన స్నేహితురాలికి ఇలా తన స్టైల్లో విషెస్ చెప్పాడు. ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అయి మస్త్ పైసల్ వెనకేసుకో అని విష్ చేశాడు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి