ఇది అరాచకం.. రాహుల్‌ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి!!

Authored By Cinema Desk | The Telugu News | Updated on: January 17, 2021, 4:30 pm

బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్ అషూ రెడ్డిలు ఇప్పుడు సోషల్ మీడియాను ఏలేస్తున్నారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇంత క్లోజ్‌గా ఉన్నట్టు కనిపించలేదు. కానీ బయటకు వచ్చాక అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ఇద్దరి మధ్య బంధం బలపడుతూ వచ్చింది. అప్పటి వరకు రాహుల్ పునర్నవి అనే వారు. ఇప్పుడు అసలు ఆ మాటే వినిపించడం లేదు.

Rahul Sipligunj Ashu Reddy latest pic On ooko kaka Launch

Rahul Sipligunj Ashu Reddy latest pic On ooko kaka Launch

ఎక్కడ చూసినా రాహుల్ అషూ రెడ్డి అని అంటున్నారు. ఈ జంటకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఈ ఇద్దరూ కలిసి చేసే రచ్చకు వారి అభిమానులు కూడా అనుమాన పడుతున్నారు. ఇద్దరు ప్రేమలో ఉన్నారా? పెళ్లి చేసుకోబోతోన్నారా? అని అడిగేస్తున్నారు. తామిద్దరం మంచి దోస్తులం అని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. కానీ రూమర్లు ఆగడం లేదు. ఆ ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయడం ఆగడం లేదు. మొత్తానికి మళ్లీ ఈ ఇద్దరూ వార్తల్లో వైరల్ అయ్యారు.

రాహుల్ సిప్లిగంజ్ తన ఊకో కాక బ్రాండ్‌ వ్యాల్యూను పెంచుకునేందుకు ఓ షాపును హైద్రాబాద్‌లో కూడా లాంచ్ చేశాడు. దానికి అషూను ముఖ్య అతిథిగా పిల్చుకున్నాడు. అక్కడికి వచ్చిన అషూతో రాహుల్ రచ్చ చేశాడు. ఏకంగా అషూను ఎత్తుకున్నాడు. అషూ కూడా రాహుల్ మీదకు ఎక్కేసింది. నిజమైన ఫ్రెండ్‌కు మన వీక్ నెస్ తెలుసు.. కానీ ఎప్పుడూ మన బలాన్ని మాత్రం బయటకు చెబుతుంది.. మజాక్ కాదు కాక ఫ్రెండ్ అంటే ఇలానే ఉండాలే.. నాకెంతో నమ్మకాన్ని ఇస్తుంది.. అషూ మా స్వాగతం అంటూ అదిరిపోయే ఫోటోలను షేర్ చేశాడు.

Cinema Desk

No bio available for this author.

  1. "Bigg Boss Telugu 10 Shalini : నా వల్లే గేమ్ పాడైంది.. శివాజీ ప్రశ్నలకు కన్నీళ్లు పెట్టుకున్న శాలినీ..!"

  2. "Hyderabad Water : అప్పుడే వాటర్ ట్యాంకర్ల కోసం క్యూ.. వచ్చే వేసవిలో హైదరాబాద్‌కు నీటి కష్టాలు తప్పవా?"

  3. "Ramya Krishnan : కృష్ణవంశీ లవ్ స్టోరీ ఆ పాటతోనే మొదలైందా? ఆసక్తికర విషయాలు చెప్పిన రమ్యకృష్ణ..!"

  4. "Apple : యాపిల్స్ కొనేటప్పుడు ఈ చిన్న పని చేయండి.. చప్పటి పండ్లు ఇంటికి రావు!"

  5. "Radhika Apte : ఎంత పెద్ద సినిమా అయినా అలాంటిదైతే నో చెబుతా.. రాధిక సంచలన వ్యాఖ్యలు"

  6. "Preity Mukhundhan నాకు అలాంటి వ్యక్తంటేనే ఇష్టం.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన ప్రీతి ముకుందన్ ..!"

  7. "Anupama Parameswaran : మా ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్.. అయినా ఆయనపై క్రష్ తగ్గట్లేదు: అనుపమ"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp