Ashu Reddy : ఎప్పుడూ చొక్కాలు విప్పుతుంటాడు.. అలీరెజాపై అషూ రెడ్డి కామెంట్స్
Ashu Reddy అషూ రెడ్డి బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్ అలీ రెజా గురించి అందరికీ తెలిసిందే. అలీ రెజా తన ఫిట్ నెస్‌తో ఎంతో మందిని ఫిదా చేసేశాడు.ఏకంగా కింగ్ నాగార్జున కూడా అలీ రెజా ఫిట్‌నెస్ చూసి ముచ్చటపడ్డాడు. అలా ఎప్పుడూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టేవారంటే తనకెంతో ఇష్టమని అలీ రెజాను పొగిడేశాడు. ఇక అలీ రెజా కూడా ప్రతీసారి చొక్కాలు విప్పుతూ తన సిక్స్ ప్యాక్ చూపిస్తుంటాడు.
బిగ్ బాస్ ఇంట్లోనే ఎన్నోసార్లు చొక్కాలు విప్పాడు. ఆడపిల్లలను పడేసేందుకే అలా చొక్కాలు విప్పుతావా? అని తమన్నా సింహాద్రి కూడా కౌంటర్లు వేసేది. అలా సమయం సందర్భం ఉన్నా లేకపోయినా కూడా అలీ రెజా చొక్కాలు విప్పుతుంటాడు. అలీ రెజా నటించిన సినిమాలు, షేర్ చేసే వీడియోల్లోనూ అలాగే చొక్కాలు తీసేస్తుంటాడు. ఇదే విషయంపై అషూ రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్‌లు మాట్లాడారు.

Rahul Siplihunj Ashu Reddy about Ali Reza
Ashu Reddy : ఎప్పుడు ఎందుకు చొక్కాలు విప్పుతావ్.. రాహుల్ అషూలు కామెంట్లు
రాహుల్, అషూలు తాజాగా ఆర్జే కాజల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అలీ రెజాపై ఈ ఇద్దరూ దారుణమైన కామెంట్లు చేశారు. అలీ రెజా కనిపిస్తే అడిగే ప్రశ్న ఏంటని ఆర్జే కాజల్ అడిగింది. దానికి ఇద్దరూ కూడా ఒకే సమాధానమిచ్చారు. ఎప్పుడు ఎందుకు చొక్కాలు విప్పుతావ్.. ఎందుకు అలా చేస్తావ్? సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్.. ఆఖరికి టైగర్ ష్రాఫ్ కూడా అన్నీ సార్లు చొక్కాలు విప్పలేదని రాహుల్ అషూలు కామెంట్లు చేశారు.