Raj Tarun Love Affair : రాజ్ తరుణ్ లవ్ ఎఫైర్.. 11 ఏళ్లుగా కలిసి ఉంటూ బాబోయ్ మనోడు ఏమో అనుకున్నాం కానీ..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 5 July 2024, 5:00 pm
  •  Raj Tarun Love Affair : రాజ్ తరుణ్ లవ్ ఎఫైర్.. 11 ఏళ్లుగా కలిసి ఉంటూ బాబోయ్ మనోడు ఏమో అనుకున్నాం కానీ..!

Raj Tarun Love Affair : యువ హీరో రాజ్ తరుణ్ లవ్ కహాని బయట పడింది. లావణ్య అనే అమ్మాయితో రాజ్ తరుణ్ 11 ఏళ్లుగా ప్రేమ కొనసాగించి కొన్నాళ్లు ఆమెతో కలిసి సహజీవనం కూడా చేసి ఫైనల్ ఆమెను కాదని దూరంగా ఉంటున్నాడట. యువ హీరో రాజ్ తరుణ్ సీక్రెట్ లవ్ ఎఫైర్ గుట్టు రట్టు అయ్యింది. లావణ్యతో కలిసి నటించిన రాజ్ తరుణ్ ఆమెతో ప్రేమాయణం కొనసాగించాడు. లవ్ మాత్రమే కాదు ఇద్దరు సీక్రెట్ గా టెంపుల్ లో పెళ్లి కూడా చేసుకున్నారట. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడని.. తనతో ఇన్నాళ్లు కలిసి ఉండి ఇప్పుడు దూరం గా ఉంటున్నాడని లావణ్య అనే అమ్మాయి సోషల్ మీడియాలో సంచలన ప్రకటన చేసింది. రాజ్ తరుణ్ తో 11 ఏళ్లుగా ప్రేమలో ఉన్నానని.. అతనితో తన పెళ్లి కూడా జరిగిందని లావణ్య చెప్పుకొచ్చింది.

Raj Tarun Love Affair పెళ్లిని సీక్రెట్ గా ఎందుకు ఉంచారు

యువ హీరో రాజ్ తరుణ్ కెరీర్ కూడా అంత ఆశాజనకంగా లేదు. మనోడు సినిమాల కన్నా ఎక్కువగా ఇలాంటి వార్తలతోనే ఎక్కువగా కనిపిస్తుంటాడు. ఆమధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ లో కార్ వదిలేసి వెళ్లిన రాజ్ తరుణ్ మళ్లీ ఇప్పుడు లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లాడి చివరకు ఆమెను దూరం పెడుతున్నాడంటూ సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈమధ్య పెళ్లిపై రాజ్ తరుణ్ పెళ్లి అసలు అవసరం లేదని. తనని కన్న పేరెంట్స్ ని మంచిగా చూసుకుంటే చాలని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు రాజ్ తరుణ్. కానీ ఇప్పుడు లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ తో సీక్రెట్ గా నడిపించిన వ్యవహారాన్ని బయట పెట్టింది. అంతేకాదు అతనితో దిగిన ఫోటోను.. ఆమె రాసిన లెటర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Raj Tarun Love Affair : రాజ్ తరుణ్ లవ్ ఎఫైర్.. 11 ఏళ్లుగా కలిసి ఉంటూ బాబోయ్ మనోడు ఏమో అనుకున్నాం కానీ..!

Raj Tarun Love Affair : రాజ్ తరుణ్ లవ్ ఎఫైర్.. 11 ఏళ్లుగా కలిసి ఉంటూ బాబోయ్ మనోడు ఏమో అనుకున్నాం కానీ..!

మరి రాజ్ తరుణ్ పై లావణ్య చేసిన ఈ సంచలన కామెంట్స్ పై అతను ఎలా రియాక్ట్ అవుతాడన్నది చూడాలి. రాజ్ తరుణ్ లావణ్యని సీక్రెట్ గా టెంపుల్ లో పెళ్లి చేసుకున్నాడని ఐతే ఆ పెళ్లిని చాలా సీక్ర్ట్ గా ఉంచారని లావణ్య చెప్పుకొచ్చింది. అసలు పెళ్లిని ఎందుకు అలా సీక్రెట్ గా ఉంచారన్నది ఎవరికి అర్ధం కావట్లేదు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp