Raj Tarun : రాజ్ త‌రుణ్ ప్రేమ క‌థ‌లో ఎన్నో ట్విస్ట్‌లు.. ఆయ‌న ఇద్ద‌రి ల‌వర్స్ మ‌ధ్య జ‌రిగిన బిగ్ ఫైట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Raj Tarun : రాజ్ త‌రుణ్ ప్రేమ క‌థ‌లో ఎన్నో ట్విస్ట్‌లు.. ఆయ‌న ఇద్ద‌రి ల‌వర్స్ మ‌ధ్య జ‌రిగిన బిగ్ ఫైట్

Raj Tarun : టాలీవుడ్ యువ హీరో రాజ్ త‌రుణ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన రాజ్ త‌రుణ్ ఆన‌తి కాలంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నాడు. ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోగా మారాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కిన ఆ చిత్రం సూపర్ హిట్ కావ‌డంతో మనోడికి మంచి ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. మొదట్లో మెరుపులు మెరిపించిన రాజ్ తరుణ్, వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. ఇప్పుడు […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 July 2024,11:48 am

ప్రధానాంశాలు:

  •  Raj Tarun : రాజ్ త‌రుణ్ ప్రేమ క‌థ‌లో ఎన్నో ట్విస్ట్‌లు.. ఆయ‌న ఇద్ద‌రి ల‌వర్స్ మ‌ధ్య జ‌రిగిన బిగ్ ఫైట్

Raj Tarun : టాలీవుడ్ యువ హీరో రాజ్ త‌రుణ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన రాజ్ త‌రుణ్ ఆన‌తి కాలంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నాడు. ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోగా మారాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కిన ఆ చిత్రం సూపర్ హిట్ కావ‌డంతో మనోడికి మంచి ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. మొదట్లో మెరుపులు మెరిపించిన రాజ్ తరుణ్, వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. ఇప్పుడు ఆయన కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడర సామీ విడుదలకు సిద్ధం అవుతుంది. రిలీజ్ మరి కొద్ది రోజుల‌లో ఉండ‌గా, మ‌నోడు వివాదంలో చిక్కుకున్నాడు.

Raj Tarun సినిమాకి మించిన ట్విస్ట్‌లు..

లావణ్య అనే యువతి రాజ్ త‌రుణ్ మీద‌ ఫిర్యాదు చేసింది. ఆమె కథనం ప్రకారం… లావణ్యతో 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇద్దరి మధ్య శారీక సంబంధం ఏర్పడింది. గుడిలో లావణ్యను రాజ్ తరుణ్ పెళ్లి కూడా చేసుకున్నాడు. మూడు నెలల క్రితం లావణ్య ఇంటి నుండి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు అని ఆమె వాపోయింది. అయితే లావ‌ణ్య వ్యాఖ్య‌ల‌పై స్పందించిన రాజ్ త‌రుణ్‌..నేను లావణ్యతో రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం నిజమే. విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఫేస్బుక్ ద్వారా లావణ్య పరిచయం అయింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా స్నేహం మరింతగా బలపడింది.

Raj Tarun రాజ్ త‌రుణ్ ప్రేమ క‌థ‌లో ఎన్నో ట్విస్ట్‌లు ఆయ‌న ఇద్ద‌రి ల‌వర్స్ మ‌ధ్య జ‌రిగిన బిగ్ ఫైట్

Raj Tarun : రాజ్ త‌రుణ్ ప్రేమ క‌థ‌లో ఎన్నో ట్విస్ట్‌లు.. ఆయ‌న ఇద్ద‌రి ల‌వర్స్ మ‌ధ్య జ‌రిగిన బిగ్ ఫైట్

రెండు మూడు ఏళ్ళు కలిసి ఉన్నాం.. ఆ తర్వాత మేము దూరం అయ్యాం. లావణ్య వేరే వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉంది. అలాంటప్పుడు ఆమెతో నేను ఎలా ఉంటాను? లావణ్యను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు మాట ఇవ్వలేదని రాజ్ త‌రుణ్ అన్నాడు., ఆమె వ్యవహారశైలి నచ్చక ఆమె నుండి విడిపోయాన‌ని రాజ్‌త‌రుణ్‌ వెల్లడించారు. డ్రగ్స్ మానేయమని ఎన్నిసార్లు చెప్పినా లావణ్య వినలేదన్నారు. మస్తాన్ సాయి అనే యువకుడితో లావణ్య సన్నిహితంగా ఉంటోందని ఆరోపించారు. వారిద్దరికీ ఎలా పరిచయం అయిందో తనకు తెలియదన్నారు. తన ఫ్లాట్ లోనే వారిద్దరూ ఉంటున్నారని, తాను లీగల్ గా ప్రొసీడ్ అవుతానని తెలిసి తన కంటే ముందే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. ఈ ట్రయాంగిల్ ప్రేమకథలో సినిమాకు మించిన ట్విస్టులు ఉండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు దీనిపై ఫోక‌స్ చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది