Raja Ravindra : చిరంజీవి , మోహన్ బాబు గొడవపై క్లారిటీ ఇచ్చిన రాజా రవీంద్ర..!
ప్రధానాంశాలు:
Raja Ravindra : చిరంజీవి , మోహన్ బాబు గొడవపై క్లారిటీ ఇచ్చిన రాజా రవీంద్ర..!
Raja Ravindra : తెలుగు పాపులర్ నటులలో ఒకరు రాజా రవీంద్ర. నిప్పురవ్వ అనే సినిమాతో రాజా రవీంద్ర నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు. సూర్యవంశం, పెదరాయుడు సినిమాలతో రాజా రవీంద్ర ఫుల్ పాపులారిటీని తెచ్చుకున్నారు. సినిమాలలో నటించడంతోపాటు రాజా రవీంద్ర పలువురు హీరో హీరోయిన్లకు డేట్లను కూడా చూసేవారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజా రవీంద్ర ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరంజీవి మోహన్ బాబు మధ్య ఉన్న గొడవల గురించి మనకెందుకు అని వాళ్ళ గొడవలు వాళ్ళు చూసుకుంటారు అని అన్నారు. ఇక రాజా రవీంద్ర రవితేజకు డేట్స్ చూశానని అన్నారు.
నేను ఆర్టిస్ట్ కావడంతో హీరో ఏదైనా ప్రాబ్లం చెబితే నాకు సులభంగా అర్థమవుతుందని రాజా రవీంద్ర అన్నారు. నాకు యాక్సెస్ ఎక్కువగా ఉంటుందని నిర్మాతలతో అందరితో తనకు పరిచయం ఉందని రాజా రవీంద్ర అన్నారు. నేను హీరోలకు మేనేజర్ అయిన యాక్టర్ గానే నన్ను చూస్తారని పేర్కొన్నారు. తనకు సినిమా కష్టాలేవి రాలేదని రాజా రవీంద్ర తెలిపారు. చిరంజీవికి మోహన్ బాబుకు మధ్య గొడవలు లేవని అన్నారు. చిరంజీవి పుట్టినరోజుకు మోహన్ బాబు బహుమతిగా బైక్ పంపించారని రాజా రవీంద్ర అన్నారు. చిరంజీవి సన్ ఆఫ్ ఇండియా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారని రాజా రవీంద్ర పేర్కొన్నారు. రవితేజ కెరీర్ ఎదుగుదలలో తన పాత్ర లేదని తన టాలెంట్ తో రవితేజ ఎదిగారని రాజా రవీంద్ర వెల్లడించారు.
మోహన్ బాబు 5 గంటలకే లేచి ఎక్ససైజ్ చేస్తారని, చాలా డిసి ప్లేన్ గా ఉంటారని, ఆయనలాగే విష్ణు కూడా చాలా డిసిప్లేన్ గా ఉంటారని, ఒకవైపు హీరోగా నిర్మాతగా రోజంతా బిజీగా ఉంటారని అయినా కూడా ఆయన నైట్ 9:30 కల్లా బెడ్ ఎక్కుతారని అంత డిస్ప్లేన్ గా ఉండడం మామూలే విషయం కాదని రాజా రవీంద్ర అన్నారు. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్లకే ఎక్కువ కష్ట ఉంటుందని దానిని నిలుపుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంటుంది. అందుకే వాళ్ళు అంతగా కష్టపడతారని రాజా రవీంద్ర అన్నారు. అలా కష్టపడకపోతే వాళ్లపై విమర్శలు వస్తాయని అన్నారు.