Rajamouli : ఒకప్పుడు సౌత్ ఇండియన్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్‌గా శంకర్ ఉండే వారు. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి సౌత్ ప్రేక్షకులు గర్వపడేలా చేశారు. ఇక ఇప్పుడు ఆయననని క్రాస్ చేసి రాజమౌళి టాప్‌లో నిలిచాడు. వరుస విజయాలతో అద్భుతమైన సినిమాలు చేస్తున్న రాజమౌళి ఉన్నత స్థాయికి చేరుకున్నీడు. రాజమౌళి గత చిత్రాలు బాహుబలి, బాహుబలి 2 జపాన్ లో ఆదరణ దక్కించుకున్న తరుణంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేశారు. ఇక జక్కన్న నెక్ట్స్ సూపర్ స్టార్ మహేష్ )తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ రేంజ్‌లో అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ అడ్వెంచరస్‌గా ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శకధీరుడు.
ప్రపంచ సాహసికుడి నేపథ్యంలో కథ సాగుతుందని ఇప్పటికే రాజమౌళి చెప్పారు. ఆఫ్రీకా అడవుల బ్యాక్ డ్రాప్‌లో కథ ఉంటుందని రైటర్ విజయేంద్రప్రసాద్ కూడా చెప్పారు. ఈ సినిమా చరిత్రని తిరగరాయనుందని అంటున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసమని జపాన్ వెళ్లిన రాజమౌళి.. ప్రత్యేకంగా ఓ గేమింగ్ స్టూడియోకి వెళ్లారు. మెటల్ గేర్ లాంటి అద్భుతమైన వీడియో గేమ్ ని సృష్టించిన హిడియోం కొజిమాని కలిసేందుకు స్టూడియోకి వెళ్లారు రాజమౌళి. అక్కడ రాజమౌళి బాడీ మొత్తాన్ని రకరకాల కెమెరాలతో స్కాన్ చేశారు హిడియో కోజిమా.
RRR పాత్రలతో ఓ గేమ్ ని ఏదైనా సిద్ధం చేస్తున్నారా అన్న డౌట్ వచ్చింది. అందుకే రాజమౌళి బాడీని స్కాన్ చేసి ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి హిడియో కోజిమా స్టూడియోలో కెమెరాలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆర్.ఆర్.ఆర్ గేం వస్తే మాత్రం తప్పకుండా అది సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. అయితే ఆ గేమ్ లో రాజమౌళి కూడా ఉంటాడు కాబట్టే ఆయన బాడీని స్కాన్ చేసి ఉంటారని చెబుతున్నారు. ఇలాంటి అవకాశం ఎప్పుడు శంకర్‌కి దక్కలేదనే చెప్పాలి. ఇక ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కి జపాన్ వెళ్లిన ఎన్.టి.ఆర్ రాం చరణ్ లకు అక్కడ ప్రేక్షకులు సూపర్ రెస్పాన్స్ ఇచ్చారు. వారు మన హీరోలని చాలా ఆప్యాయంగా పలకరించారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.