Prabhas : ప్ర‌భాస్‌కి ఎక్కువ‌గా కోపం తెప్పించే వ్య‌క్తి ఒక‌డే ఉన్నాడు.. అత‌డు ఎవ‌రో తెలుసా..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Prabhas : ప్ర‌భాస్‌కి ఎక్కువ‌గా కోపం తెప్పించే వ్య‌క్తి ఒక‌డే ఉన్నాడు.. అత‌డు ఎవ‌రో తెలుసా..?

Prabhas : పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌ల్కి, రాజా సాబ్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఆయ‌న సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ లుక్స్ లో చాలా చేంజెస్ గ‌మ‌నించాం. ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌లు ప్ర‌భాస్‌ని ఇబ్బంది పెట్టాయి. దాంతో ఆయ‌న బాడీ ఫిట్‌నెస్ పై పెద్దగా దృష్టి సారించలేకపోయారని తెలుస్తుంది. అయితే ఇటీవల చికిత్స చేయించుకొని ప్రభాస్ పూర్తి […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 April 2024,1:01 pm

ప్రధానాంశాలు:

  •  Prabhas : ప్ర‌భాస్‌కి ఎక్కువ‌గా కోపం తెప్పించే వ్య‌క్తి ఒక‌డే ఉన్నాడు.. అత‌డు ఎవ‌రో తెలుసా..?

Prabhas : పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌ల్కి, రాజా సాబ్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఆయ‌న సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ లుక్స్ లో చాలా చేంజెస్ గ‌మ‌నించాం. ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌లు ప్ర‌భాస్‌ని ఇబ్బంది పెట్టాయి. దాంతో ఆయ‌న బాడీ ఫిట్‌నెస్ పై పెద్దగా దృష్టి సారించలేకపోయారని తెలుస్తుంది. అయితే ఇటీవల చికిత్స చేయించుకొని ప్రభాస్ పూర్తి ఆరోగ్యంగా మారారు. అంతే కాదు ఆయ‌న ఇప్పుడు స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఒక్కప్పటి లుక్స్ లోకి ట్రాన్స్‌ఫార్మ్ అయిన ప్ర‌భాస్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Prabhas : ఎందుకంత కోపం..

ఇక చివ‌రిగా ప్ర‌భాస్ స‌లార్ మూవీతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే. సలార్ మూవీలో దేవ అనే పాత్రలో ప్రభాస్ నటించగా.. మొదట ప్రాణ మిత్రుడిగా ఉండి శత్రువుగా మారిన వరదరాజ మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ న‌టించి అల‌రించారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు షారుక్ ఖాన్ డంకీ నుంచి పోటీ ఎదురవడంతో ఊహించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. లేదంటే ఈ మూవీ ప‌లు రికార్డ్‌ల‌ని సులువుగా క్రాస్ చేసి ఉండేది. అయితే క‌ల్కితో మాత్రం ప్ర‌భాస్ స‌రికొత్త రికార్డ్‌లు నెల‌కొల్ప‌డం ఖాయం అంటున్నారు. తాజాగా ప్రభాస్, డైరెక్టర్ రాజమౌళికి సంబంధించిన ఓ రేర్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

Prabhas ప్ర‌భాస్‌కి ఎక్కువ‌గా కోపం తెప్పించే వ్య‌క్తి ఒక‌డే ఉన్నాడు అత‌డు ఎవ‌రో తెలుసా

Prabhas : ప్ర‌భాస్‌కి ఎక్కువ‌గా కోపం తెప్పించే వ్య‌క్తి ఒక‌డే ఉన్నాడు.. అత‌డు ఎవ‌రో తెలుసా..?

ఇందులో ప్రభాస్ గురించి మాట్లాడుతూ..డార్లింగ్ ను అచ్చుగుద్దినట్లు ఇమిటేట్ చేశాడు జక్కన్న “ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే వ్యక్తి కెమెరామెన్ సెంథిల్ మాత్రమే. ఎందుకంటే అత‌ను నా కన్నా కూడా పర్ఫెక్షనిస్ట్.. ఆర్టిస్ట్ రెడీ అయ్యే టైంలో కూడా చెక్ చేసుకుంటాడు. అది ప్రభాస్‏కు కోపం తెప్పిస్తుంది. కోపం వచ్చినప్పుడు ప్రభాస్.. ఏయ్ సెంథిల్.. ఏంత సేపయ్యా.. ఎన్నాళయ్యా.. అంటాడు” అంటూ చెబుతూ ప్రభాస్ వాయిస్‏తోపాటు మ్యానరిజం కూడా అచ్చుదింపాడు రాజ‌మౌళి. ప్ర‌భాస్‌ని సేమ్‌గా దింపేసిన రాజమౌళిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది