Rajamouli Mahesh Babu : మహేష్ బాబు సినిమా కోసం భారీ ఖర్చు.. ఆ ఒక్క సీన్ కోసమే వంద కోట్లా..!
ప్రధానాంశాలు:
Rajamouli Mahesh Babu : మహేష్ బాబు సినిమా కోసం భారీ ఖర్చు.. ఆ ఒక్క సీన్ కోసమే వంద కోట్లా..!
Rajamouli Mahesh Babu : రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్ రూపొందుతుందన్న విషయం తెలిసిందే. ఒక్కో సీన్ ను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు జక్కన్న. ఎందుకంటే పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి చాలా శ్రద్ధ పెడుతున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక్క సీన్ కోసం 100 కోట్లు పెట్టి మరి ఆ సిన్ ను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Rajamouli Mahesh Babu : మహేష్ బాబు సినిమా కోసం భారీ ఖర్చు.. ఆ ఒక్క సీన్ కోసమే వంద కోట్లా..!
ఐదు నిమిషాల పాటు ఉండే ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం దాదాపు 100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నేపధ్యం లో తెరకెక్కుతున్న ఈ ఫైట్ కి భారీగా గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నారట. అందుకే అంత మొత్తం ఖర్చు అవుతుందని అంటున్నారు.
ఇక చిత్రంలో ఫైట్ కోసం ప్రత్యేకంగా ఒక సెట్ ని కూడా వేసినట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి గొప్ప గుర్తింపును కూడా సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇందులో ప్రియాంకచోప్రా కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతో రాజమౌళి క్రేజ్ తో పాటు మహేష్ బాబు క్రేజ్ కూడా ఓ రేంజ్‌కి వెళ్లనుంది.