Rajamouli Mahesh : మహేష్ రాజమౌళి సినిమా కోసం అరకు గుహ.. ఆఫ్రికా అడవులకు ఇదేం కనెక్షన్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajamouli Mahesh : మహేష్ రాజమౌళి సినిమా కోసం అరకు గుహ.. ఆఫ్రికా అడవులకు ఇదేం కనెక్షన్..?

 Authored By ramu | The Telugu News | Updated on :1 January 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Rajamouli Mahesh : మహేష్ రాజమౌళి సినిమా కోసం అరకు గుహ.. ఆఫ్రికా అడవులకు ఇదేం కనెక్షన్..?

Rajamouli Mahesh : సూపర్ స్టార్ మహేష్ నెక్స్ట్ సినిమా రాజమౌళి SS Rajamouli డైరెక్షన్ లో తెరకెక్కనుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమా విషయంలో ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉందని తెలుస్తుంది. కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం కాస్టింగ్ వేటలో ఉన్నాడు రాజమౌళి. ఈ సినిమాను ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉంటుందని తెలుస్తుండగా ఆమధ్య రాజమౌలి లొకేషన్స్ చూస్తూ కనిపించాడు. ఐతే మరోపక్క రాజమౌళి ఈ సినిమా కోసం అరకులో కూడా లొకేషన్స్ చూస్తున్నారట. అరకు గుహ లో కూడా షూట్ చేసేలా ప్లానింగ్ చేస్తున్నారట. ఐతే ఆఫ్రికా అడవులకు అరకు గుహలకు సంబంధం ఏంటన్నది తెలియదు కానీ జక్కన్న మాత్రం ఈ సినిమాను నెవర్ బిఫోర్ అనిపించేలా చేస్తున్నాడని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా యాక్ష సన్నివేశాలు ఫ్యాన్స్ ని మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయని తెలుస్తుంది.

Rajamouli Mahesh మహేష్ రాజమౌళి సినిమా కోసం అరకు గుహ ఆఫ్రికా అడవులకు ఇదేం కనెక్షన్

Rajamouli Mahesh : మహేష్ రాజమౌళి సినిమా కోసం అరకు గుహ.. ఆఫ్రికా అడవులకు ఇదేం కనెక్షన్..?

Rajamouli Mahesh ప్రియాంక చోప్రా హీరోయిన్..

సినిమాలో మహేష్ తో జత కట్టేది ఎవరన్నది డిస్కషన్ నడుస్తుంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైంది అని టాక్. మరోపక్క ఇండోనేషియా హీరోయిన్ ని తీసుకుంటాడని తెలుస్తుంది. ఐతే వారిద్దరిలో ఎవరు ఫైనల్ అన్నది మాత్రం త్వరలో తెలుస్తుంది. రాజమౌళి సినిమా కోసం మహేష్ పూర్తిగా కొత్త లుక్ తో కనిపించనున్నారు. ఈ సినిమా విషయంలో మహేష్ ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదని ఫిక్స్ అయ్యాడట.

అంతేకాదు ఈ సినిమాను రాజమౌళి రెండు భాగాలుగా తీసె ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ 3 ఏళ్లు టైం ఇవ్వనున్నాడని తెలుస్తుంది. రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ హీరోగా వస్తున్న ఈ సినిమాను 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తారని టాక్ నడుస్తుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ కూడా పనిచేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా త్వరలోనే లాంచ్ చేయనుండగా మొదలు పెట్టినప్పటి నుంచే ప్రమోషన్స్ భారీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది