Mahesh Rajamouli Movie : మహేష్ కోసం థోర్ యాక్టర్.. జక్కన్న ప్లానింగ్ అదుర్స్..!
ప్రధానాంశాలు:
Mahesh Rajamouli Movie : మహేష్ కోసం థోర్ యాక్టర్.. జక్కన్న ప్లానింగ్ అదుర్స్..!
Mahesh Rajamouli Movie : సూపర్ స్టార్ నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో చేయనున్నాడు. ఈ సినిమా విషయంలో జక్కన్న ప్లానింగ్ అంతా ఒక రేంజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మహేష్ తో రాజమౌళి సినిమా కొన్నళ్లుగా డిస్కషన్ గా ఉన్నా ఇన్నాళ్లకు అది కుదిరింది. 2025 మొదట్లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కూడా భాగం అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మొన్నటిదాకా ఇండోనేషియా హీరోయిన్ ని తీసుకున్నార్ని చెప్పగా లేటెస్ట్ గా ప్రియాంకా చోప్రా ని కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఐతే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారా లేదా ఒక్కరేనా అన్నది తెలియాల్సి ఉంది. ఇక లేటెస్ట్ గా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో థోర్ యాక్టర్ క్రిస్ హెమ్స్ వర్త్ ని తీసుకుంటారని టాక్. మహేష్ సినిమాలో హాలీవుడ్ స్టార్ ఆ న్యూస్ వింటేనే సర్ ప్రైజింగ్ గా ఉంది.
Mahesh Rajamouli Movie క్రిస్ హెమ్స్ వర్త్ ని తీసుకోవడం జరిగితే మాత్రం..
అవెంజర్స్ సీరీస్ లో నటించిన క్రిస్ హెమ్స్ వర్త్ ని తీసుకోవడం జరిగితే మాత్రం మహేష్ సినిమాకు హాలీవుడ్ అప్పీల్ వచ్చినట్టే లెక్క. ఇప్పుడే కాదు మహేష్ ని రెండు దశాబ్ధాల క్రితమే హాలీవుడ్ హీరో కటౌట్ అని అందరు అంటుంటారు. దానికి తగినట్టుగానే మహేష్ సినిమాలు చేస్తూ ఇమేజ్ ని పెంచుకుంటూ వచ్చారు. రాజమౌళి సినిమా చేయకుండానే మహేష్ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఇక ఇప్పుడు రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్టార్ గా అవతరించబోతున్నాడు. ఇన్నాళ్లు మహేష్ స్టామినా ఏంటన్నది తెలుగు తెర మీద మాత్రమే చూశారు ఇంటర్నేషనల్ లెవెల్ లో సూపర్ స్టార్ హంగామా ఎలా ఉండబోతుందో రాజమౌళి సినిమాతో తెలుస్తుంది. RRR సినిమా కేవలం సాంగ్ కి మాత్రమే ఆస్కార్ తెచ్చింది. కానీ ఈసారి రాజమౌళి మహేష్ సినిమాతో అన్ని కేటగిరిల్లో ఆస్కార్ టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది. Thor Actor, Chris Hems Warth, Mahesh, Rajamouli