RRR Movie : తగ్గేదేలే అంటోన్న రాజమౌళి.. వామ్మో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌కి అన్ని కోట్ల ఖర్చా…?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 31, 2021, 8:50 pm

RRR Movie : బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తోన్న ఈ పాన్‌ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా ఈ సినిమా విడుదలపై అనుమానులు వ్యక్తం అయినా.. తాజాగా అలాందేమి లేదని చిత్ర యూనిట్ మరోసారి స్పష్టం చేసింది. పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీలలో కూడా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా గురించే చర్చ జరుగుతుంది. జనవరి 7న విడుదల కానున్న ట్రిపుల్ ఆర్‌కు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. అయితే సినిమాలకు వందల కోట్లు ఖర్చు చేయించే జక్కన్న.. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌ కోసం కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారట.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం బృందం.. ప్రమోషన్ కార్యక్రమాలను జోరు మీద చేస్తున్నారు. తాజాగా హిందీలో కపిల్ శర్మ షోలో పాల్గొనగా.. ఇటు సౌత్‌ లో కేరళ, తమిళనాడు అని ఖాళీ అనేదే లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఇదిలా ఉండగా.. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ప్రమోషన్స్‌ కోసం పెడుతోన్న ఖర్చుతో టాలీవుడ్‌లో ఓ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని రూపొందించవచ్చునని ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా లీక్ అవుతున్న సమాచరం బట్టి రాజమౌళి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కోసమే ఏకంగా 52 కోట్లు ఖర్చు చేసారట. ఈ వార్త సినీ అభిమానులు అవాక్కవుతున్నారు. కేవలం ప్రమోషన్స్‌ కోసమే అంత ఖర్చు పెడుతున్నారంటే.. ఈ మూవీతో వందల కోట్లను కొల్లగొడుతామని గట్టి నమ్మకంతో రాజమౌళి ఉన్నాడేమే అని అంటున్నారు.

rajamouli spending 52 crores for rrr movie promotions

rajamouli spending 52 crores for rrr movie promotions

RRR Movie : ప్రమోషన్స్‌కే రూ. 52 కోట్లు..!

భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. గోండు వీరుడు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించగా.. అల్లూరి సీతారామరాజు రోల్‌లో రామ్ చరణ్ కనిపించనున్న ఈ చిత్ర ట్రైలర్‌ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp