Mahesh Rajamouli : 50 కోట్ల బడ్జెట్ వారణాసి సెట్.. మహేష్ సినిమా కోసం రీక్రియేట్ చేస్తున్న రాజమౌళి..!
Mahesh Rajamouli : దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి ఆర్థిక వనరుల పరంగా ఎలాంటి సమస్యా లేదు. ఆయన తన సినిమా కోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నారట. మహేష్ కథానాయకుడిగా అతడు రూపొందిస్తున్న ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ- ఎస్.ఎస్.ఎం.బి 29 కోసం 50 కోట్ల బడ్జెట్ తో వారణాసి సెట్ నిర్మిస్తున్నారని తెలిసింది.
Mahesh Rajamouli : 50 కోట్ల బడ్జెట్ వారణాసి సెట్.. మహేష్ సినిమా కోసం రీక్రియేట్ చేస్తున్న రాజమౌళి..!
నిజానికి గంగా నది ఒడ్డున రియల్ లొకేషన్లలో ఇలాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించాలంటే అది సవాల్ తో కూడుకున్నది. పోలీసుల నుంచి అనుమతులు పొందడం అంత సులువు కాదు. దాంతో పాటు, ప్రజల నుంచి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి.అందుకే రాజమౌళి వారణాసిని తలపించే ఓ భారీ సెట్ ని నిర్మించాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది. వారణాసి అంటే దేవాలయాలు, ఘాట్‌లతో ఆధ్యాత్మికత నిండిన ప్రదేశం.
అలాంటి మరో నగరాన్ని నిర్మించాలనే ఆలోచన సవాళ్లతో కూడుకున్నది. ఒరిజినాలిటీ చెడకుండా దానిని చూపించాలి. దీనికోసం ఆర్ట్ డైరెక్టర్ సమక్షంలో రాజమౌళి పని చేస్తున్నారని తెలిసింది. అడవిలో పర్వతాలలో సంజీవని వనమూలికను వెతకడానికి వెళ్లిన హనుమంతుడి స్ఫూర్తితో ఈ కథను రూపొందించారని టాక్ వినిపిస్తోంది. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయిక. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు.
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్…
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
This website uses cookies.