Aadhaar update : ఇకపై ఆధార్ కార్డు అప్డేట్ కోసం ఆధార్ సెంటర్ కు వెళ్లనవసరం లేదు.. మీ ఫోన్లోనే చేసుకోవచ్చు.. ఎలా అంటే !!
Aadhaar update : ప్రతి పౌరునికీ ప్రత్యేక గుర్తింపుగా ఉండే ఆధార్ కార్డును క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడం చాలా అవసరం. ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగ సేవలు పొందేందుకు ఆధార్ ముఖ్యమైన ఆధారంగా మారింది. ఈ నేపథ్యంలో భారత యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (UIDAI) ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆధార్ కార్డును ప్రతి పదేళ్లకోసారి అప్‌డేట్ చేయాలని సూచించగా, పిల్లల ఆధార్‌ను మాత్రం వారు 15 ఏళ్ల వయస్సు వచ్చే సరికి అప్డేట్ చేయాలన్నారు.
Aadhaar update : ఇకపై ఆధార్ కార్డు అప్డేట్ కోసం ఆధార్ సెంటర్ కు వెళ్లనవసరం లేదు.. మీ ఫోన్లోనే చేసుకోవచ్చు.. ఎలా అంటే !!
ఇప్పటివరకు చిరునామా, పేరు, పుట్టిన తేది వంటి వివరాలను ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. కానీ ఫోటో, బయోమెట్రిక్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ మార్పుల కోసం మాత్రం ప్రజలు ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ రానున్న రోజుల్లో ఈ విధానం మారనుంది. UIDAI ప్రకటించిన ప్రకారం.. నవంబర్ నాటికి ఓ కొత్త మొబైల్ యాప్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ యాప్ ద్వారా చాలా ఆధార్ అప్‌డేట్లు ఇంటి నుంచే చేసుకోవచ్చు. కేవలం బయోమెట్రిక్, ఐరిస్ స్కానింగ్ కోసం మాత్రమే కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
ఈ యాప్ ద్వారా ఆధార్ వివరాల అప్‌డేట్ మరింత సులభతరం కానున్నా, సెక్యూరిటీ అంశాన్ని UIDAI ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకొంది. ఈ కారణంగా ప్రతి అప్‌డేట్‌కు ఓటీపీ ధృవీకరణను తప్పనిసరి చేసింది. దీంతో వివరాలు అప్డేట్ చేయాలంటే మొబైల్ నెంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. ఇందుకోసం లింకింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఒకసారి యాప్ అందుబాటులోకి వస్తే, ప్రజలు ఇంటి నుంచే ఆధార్ కార్డులో మార్పులు చేసుకునే సౌకర్యం పొందవచ్చు. దీనివల్ల ఆధార్ కేంద్రాల వద్ద ఉండే రద్దీ, టైమ్ వేస్ట్ తగ్గుతాయి.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.