Rajendra Prasad : రాజేంద్ర ప్ర‌సాద్ జీవితంలోనే ఎందుకిలా జ‌రిగింది..క‌న్నీరు మున్నీరుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajendra Prasad : రాజేంద్ర ప్ర‌సాద్ జీవితంలోనే ఎందుకిలా జ‌రిగింది..క‌న్నీరు మున్నీరుగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :6 October 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Rajendra Prasad : రాజేంద్ర ప్ర‌సాద్ జీవితంలోనే ఎందుకిలా జ‌రిగింది..క‌న్నీరు మున్నీరుగా..!

Rajendra Prasad : టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. కొన్నాళ్లుగా త‌న కామెడీతో అల‌రిస్తూ వ‌స్తున్న రాజేంద్ర ప్ర‌సాద్ ఇప్ప‌టికీ వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తూ మెప్పిస్తున్నాడు. అయితే ఆయ‌న కూతురు గాయ‌త్రి (38) గుండెపోటుతో శుక్ర‌వారం రాత్రి క‌న్నుమూసింది. గుండెపోటు రావ‌డంతో కుటుంబ‌స‌భ్యులు గాయ‌త్రిని హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ రాజేంద్ర‌ప్ర‌సాద్ కూతురు గాయ‌త్రి తుదిశ్వాస విడిచింది. గాయత్రి మ‌ర‌ణంతో రాజేంద్ర‌ప్ర‌సాద్ కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. గాయ‌త్రి కూతురు సాయితేజ‌స్విని మ‌హాన‌టి సినిమాలో చిన్న‌నాటి కీర్తిసురేష్ పాత్ర‌లో క‌నిపించింది.

Rajendra Prasad క‌ళ్లు చెమ్మ‌గిల్లుతున్నాయి..

రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు ఓ కొడుకు బాలాజీ ప్ర‌సాద్‌తో పాటు కూతురు గాయ‌త్రి ఉన్నారు. గాయ‌త్రి ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి త‌ర్వాత కూతురితో త‌న‌కు చాలా రోజుల పాటు మాట‌లు లేవ‌ని ఓ సినిమా వేడుక‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్ అన్నాడు. సినిమాల్లో లాగే.. రాజేంద్ర ప్రసాద్, గాయత్రిల బంధం ఎన్నో బరువెక్కిన బాధలతో నిండి ఉంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రిది ప్రేమ వివాహం. ఈ పెళ్లి రాజేంద్ర ప్రసాద్‌కు ఇష్టం లేదు.కానీ.. గాయత్రి, ప్రేమించిన వారిని వదలిపెట్టలేక పెళ్లి చేసుకుని తండ్రికి దూరమైంది. కొన్నాళ్ల పాటు వీళ్లిద్దరి మధ్య అసలు మాటలు లేవు. కాగా రాజేంద్రప్రసాద్ 2018లో బేవర్స్ అనే సినిమాలో నటించాడు.ఈ సినిమాలో తల్లి.. తల్లి నా చిట్టి తల్లి అంటూ సునీల్ కశ్యప్ కంపోజ్ చేసి.. ఆలపించిన గీతం వింటుంటే.. గొంతు ఆరిపోతుంది. అంత గొప్పగా ఈ పాటను కంపోజ్ చేశాడు. అంతే గొప్పగా సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాశాడు.

Rajendra Prasad రాజేంద్ర ప్ర‌సాద్ జీవితంలోనే ఎందుకిలా జ‌రిగిందిక‌న్నీరు మున్నీరుగా

Rajendra Prasad : రాజేంద్ర ప్ర‌సాద్ జీవితంలోనే ఎందుకిలా జ‌రిగింది..క‌న్నీరు మున్నీరుగా..!

ఈ పాట గురించి చెప్తూ రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. ఈ పాటను.. తన కూతురు గాయత్రిని ఇంటికి పిలిపించి నాలుగు సార్లు వినిపించాడట.ఈ పాట విని ఇద్దరు కంటతడి పెట్టారట. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటలు స్టార్ట్ అయ్యాయని… అలా ఆ పాట తనను మార్చిందని పాట గొప్పతనాన్ని తెలిపాడు. అలా తన కూతురిపై బంధాన్ని వెల్లడించాడు. . ఏ అమ్మవారిని అయితే అమ్మగా రాజేంద్రప్రసాద్ భావించారో.. ఆ అమ్మవారికి ఇష్టమైన దసరా రోజులలోనే తన కుమార్తెను కోల్పోవ‌డం ప్ర‌తి ఒక్క‌రిని బాధిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది