Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. నెట్టింట తెగ ట్రోలింగ్
ప్రధానాంశాలు:
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. నెట్టింట తెగ ట్రోలింగ్
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన తానా సభల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. గతంలో ఎస్‌వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో ఆలీపై, ‘రాబిన్ హుడ్’ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవగా, ఇప్పుడు ఇంటర్నేషనల్ వేదికపై పలు అతిశయోక్తులతో వార్తల్లో నిలిచారు.

Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. నెట్టింట తెగ ట్రోలింగ్
Rajendra Prasad : మళ్లీ వివాదంలో..
తానా సభలలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కేసులతో ఒత్తిడిలో ఉన్న సమయంలో, తాను నటించిన సినిమాలు చూస్తూ ఊరట పొందేవారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రధాని స్థాయిలో ఉన్న నాయకుడిపై ఇలా అనడం అవసరమా? అనే ప్రశ్నలు కలుగజేశాయి.
అంతేగాక, దివంగత కవి సి. నారాయణరెడ్డి మాటలను ఉటంకిస్తూ, “ప్రతి తెలుగు ఇంట్లో మంచం కంచంలా నేనే ఉంటాను” అన్న వ్యాఖ్యలు కొంతమందికి అతిశయోక్తిగా అనిపించాయి. అలాగే, “నిమ్మకూరలోని ఎన్టీఆర్ ఇంట్లోనే తాను పుట్టాను”, “తానా ఏర్పడిన సంవత్సరం 1977లోనే తన సినీ ప్రయాణం ప్రారంభమైందిష, శ్రీ సత్య సాయిబాబా జుట్టు మీద జోకులు” లాంటి వ్యాఖ్యలు కూడా చాలా మందిని అసౌకర్యానికి గురి చేశాయి. మొత్తానికి, మరోసారి రాజేంద్రప్రసాద్ ప్రసంగం చర్చనీయాంశంగా మారింది.