
Rajendra Prasad : చచ్చిపోదామని అనుకున్న రాజేంద్ర ప్రసాద్.. కారణం ఏంటో తెలుసా?
Rajendra Prasad : ఒకానొక టైమ్ లో కామెడీ సినిమా అంటే రాజేంద్రప్రసాద్. నట కిరీటిగా…నవ్వుల పండిచే హాస్య హీరోగా మనందరికి గుర్తొచ్చే పేరు రాజేంద్ర ప్రసాద్. ఆయనని ఆంద్రా చాప్లిన్ అంటారు. నవ్వుల కిరిటి అనీ నవ్వుల రారాజనీ చాలా మంది అంటారు.తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు ప్రధాన మంత్రులను సైతం అభిమానులుగా మార్చుకున్న చరిత్ర సాధించిన మేటి నటుడు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన నిమ్మకూరు నుంచి ఇండస్ట్రీకి వచ్చి కామెడీ హీరోగా ఒక చరిత్ర లిఖించి.. సీరియస్ పాత్రలలో నటుడిగా అవార్డులు రివార్డులు సొంతం చేసుకొని.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు రాజేంద్ర ప్రసాద్.
Rajendra Prasad : చచ్చిపోదామని అనుకున్న రాజేంద్ర ప్రసాద్.. కారణం ఏంటో తెలుసా?
కెరీర్ ఆరంభంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్. అప్పట్లో అవకాశాల్లేక తాను బలవన్మరణం చేసుకోవాలని అనుకున్నట్లు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. చేతిలో డబ్బుల్లేక దాదాపు మూడు నెలల పాటు అన్నం తినలేదని చెప్పారు. మా నాన్న స్కూల్ టీచర్ ఎంతో చాలా కఠినంగా వ్యవహరించేవారు. ఇంజినీరింగ్ పూర్తవ్వగానే సినిమాల్లోకి వెళ్దమనుకున్నాను. కానీ అది ఆయనకు నచ్చలేదు. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అది నీకు సంబంధించిన విషయమే. ఒకవేళ సక్సెస్ కాలేదంటే ఇంటికి రావద్దు అని అన్నారు. దీంతో మద్రాస్ వెళ్లి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి గోల్డ్ మెడల్ సాధించా. అయినా అవకాశాలు మాత్రం రాలేదు. పెద్ద గ్లామర్‌గా లేనని కూడా తెలుసు. అలాంటి సమయంలో తిరిగి ఇంటికి వెళ్తే, రావొద్దు అని కోప్పడ్డారు. దీంతో బాధతో మళ్లీ మద్రాస్ వచ్చేశా. అప్పుడు చనిపోదామనుకున్నాను అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
తాను మద్రాస్ వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరానని… గోల్డ్ మెడల్ సాధించానని తెలిపారు. అయితే సినిమా అవకాశాలు మాత్రం రాలేదని చెప్పారు. ఇంటికి తిరిగి వెళ్తే… రావద్దన్నాను కదా ఎందుకు వచ్చావని నాన్న అన్నారని… ఎంతో బాధతో వెంటనే మద్రాస్ కు వచ్చానని తెలిపారు. ఒకరోజు నిర్మాత పుండరీకాక్షయ్య ఆఫీసుకు వెళ్తే… అక్కడ ఏదో గొడవ జరుగుతోందని… తన రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆయన తనను డబ్బింగ్ థియేటర్ కు తీసుకెళ్లారని… ఒక సీన్ కు తనతో డబ్బింగ్ చెప్పించారని… అది ఆయనకు బాగా నచ్చడంతో రెండో సీన్ కు డబ్బింగ్ చెప్పించారని తెలిపారు. చేతిలో డబ్బుల్లేక దాదాపు మూడు నెలలు అన్నం కూడా తినలేదని తెలిపారు. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.