Pawan Kalyan : టీడీపీ నేత‌ల‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ణుకు పుట్టిస్తున్నాడా.. కూట‌మిలో ఏం జ‌రుగుతుంది..!

Pawan Kalyan : జ‌న‌సేనాని, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఏపీలో ప్ర‌భంజ‌నం అయ్యారు. ప‌దవి చేప‌ట్టిన‌ తొలి నాళ్లలో సైలెంట్ గా కనిపించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు పూర్తిగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి గత వైసీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున సాగిన రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విపక్షంలో ఉండగా తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్.. అధికారంలోకి వచ్చీ రాగానే దీనిపై ఫోకస్ పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పౌరసరఫరాల మంత్రిగా నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకుని, వేల టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. అయితే పవన్ కల్యాణ్ అక్కడికి వస్తే విషయం పెద్దవుతుందని భావించిన అధికారులు ఆయన రాకుండా శతవిథాలుగా ప్రయత్నాలు చేశారని స్వయంగా చెప్పేశారు ప‌వ‌న్ .

Pawan Kalyan : టీడీపీ నేత‌ల‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ణుకు పుట్టిస్తున్నాడా.. కూట‌మిలో ఏం జ‌రుగుతుంది..!

Pawan Kalyan ప‌వ‌న్ ప్ర‌భంజ‌నం..

దీంతో ఓ డిప్యూటీ సీఎంనే అడ్డుకునే స్ధాయిలో అధికారులు, రేషన్ మాఫియా ఉందన్న చర్చ జరుగుతోంది.అక్రమంగా రవాణా కావడంపై అధికారులు నేతలపై పవన్ ఫైర్ అయ్యారు. మీకు తెలియకుండా ఇలా బియ్యం వెళుతుందా అని అధికారులను,నేతలన నిలదీశారు. అంతటితో ఆగని పవన్ పక్కనే ఉన్న కాకినాడ టీడీపీ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.మీరు ఇలాంటి అక్రమదారులతో కాంప్రమైజ్ ఐతే ఎలా అని నిలదీశారు. గత ప్రభుత్వంపై మనం విమర్శలు చేసి ఇప్పుడు మనం అదే తప్పును చేస్తే ఎలా అని కడిగి పారేశారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్క సారిగా షాక్ అయ్యారు. పవన్ ఎమ్మెల్యే కొండ బాబుపై సీరియస్ అవడడంపై ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరుగుతుంది.

కాకినాడ పోర్టుకు వెళ్లిన పవన్ ను అధికారులు అడుగడుగునా అడ్డుకున్నారు. చివరికి దక్షిణాఫ్రికా షిప్ వరకూ వెళ్లి దాన్ని ఎక్కేందుకు పవన్ చేసిన ప్రయత్నాలకూ ఆటంకాలు కల్పించారు. వాతావరణం అనుకూలంగా లేదనే కారణాలూ చెప్పారు. అయినా పవన్ ను మాత్రం అడ్డుకోలేకపోయారు. చివరికి పవన్ రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. దీంతో కాకినాడ పోర్టులో లోపాలన్నీ బయటపడ్డాయి. రోజుకు వెయ్యి లారీలు వచ్చే కాకినాడ పోర్టుకు కేవలం 16 మందితో భద్రత కల్పించడం, పోర్టుకు వెళ్తున్న లోడును చెక్ చేసే యంత్రాంగం కూడా అక్కడ లేదని తెలుస్తోంది. కాగా \,కొద్ది రోజుల క్రితం కూడా హోం మంత్రి అనితపై ఇదే విధంగా బహిరంగంగానే పవన్ సీరియస్ అయ్యారు. ఏపీలో వరుస రేప్ ఘటనలు జరుగుతుంటే హోం మంత్రి ఏం చేస్తున్నట్లు పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనమే రేపింది

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

8 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

11 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

15 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

18 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

20 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

2 days ago