Karthika Deepam 2 Today Episode April 15th : దశరథ కండిషన్ వెరీ సీరియస్ అన్న డాక్టర్లు.. షాక్‌లో శివన్నారాయణ, దీప బయటికి రావొద్దన్న సుమిత్ర
ప్రధానాంశాలు:
Karthika Deepam Serial Today : దశరథ కండిషన్ వెరీ సీరియస్ అన్న డాక్టర్లు.. షాక్‌లో శివన్నారాయణ, దీప బయటికి రావొద్దన్న సుమిత్ర
Karthika Deepam 2 Today Episode April 15th : స్టార్ మాలో ప్రసారం అవుతున్న karthika deepam serial కార్తీక దీపం-2 సీరియల్ ఈరోజు ఏప్రిల్ 15వ తేదీ ఎపిసోడ్‌లో karthika deepam today episode ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ జరిగిందంతా చెప్పడంతో కాంచన, అనసూయ ఇద్దరూ షాక్ గురైతారు. ఇప్పుడు మా అన్నయ్యకు ఎలా ఉంది, నేను వెంటనే చూడాలని అనడంతో తాను ఇప్పుడే అక్కడి నుంచే వస్తున్నాను మామయ్యకు ఆపరేషన్ జరుగుతోంది లోపలికి రానివ్వడం లేదు అని కార్తీక్ తెలుపుతాడు. అయినా దీప గన్‌తో కాల్చడం ఏంటి బాబు అనడంతో నాకు అదే అర్థం కావడం లేదంటాడు కార్తీక్. నేను వెళ్లి మా అన్నని చూడాలని కాంచన అనగానే, తాతయ్య మనల్ని రావద్దు అని చెప్పారు అనడంతో, నన్ను రావద్దు అని చెప్పడానికి ఆయన ఎవరూ అని కోపంగా అంటుంది. నేను చెప్పేది విను నా మాట అర్థం చేసుకో అమ్మ నా మీద ఏ మాత్రం అభిమానం ఉన్న మీరు అక్కడికి వెళ్లొద్దు అంటాడు కార్తీక్.

Karthika Deepam 2 Today Episode April 15th : దశరథ కండిషన్ వెరీ సీరియస్ అన్న డాక్టర్లు.. షాక్‌లో శివన్నారాయణ, దీప బయటికి రావొద్దన్న సుమిత్ర
మరొకవైపు దశరథకు ఏమవుతుందోనని సుమిత్రా ఏడుస్తూ ఉండగా కుటుంబ సభ్యులు ఓదారుస్తుంటారు. ఇంతలో డాక్టర్ వచ్చి ఆయన కండిషన్ కాస్త సీరియస్ గానే ఉంది ఐసీయూలోకి షిఫ్ట్ చేశాం కళ్లు తెరిచే వరకు ఏమి చెప్పలేము అంటాడు. శివన్నారాయణను డాక్టర్ పక్కకు పిలుచుకుని వెళ్తాడు. నా కొడుకు ఎలా ఉంది డాక్టర్ అనడంతో దశరథ బతకడం కష్టమే అంటాడు. ఆయనకు బుల్లెట్ గుండెకు దగ్గరగా వెళ్లింది. ట్రీట్‌మెంట్ జరుగుతోంది. 24 గంటల్లో ఆయన కళ్లు తెరిస్తే మీ అదృష్టం లేదంటే ఆయన బతకడం చాలా కష్టం అని చెప్పడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. ఇంట్లో వాళ్లని మీరే మెంటల్ గా ప్రిపేర్ చేయాలని అనడంతో శివన్నారాయణ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో సుమిత్రా వచ్చి ఏమయిందని అడగడంతో, ఏమీ కాలేదు వాడు బతుకుతాడు అని చెప్పి కవర్ చేస్తాడు.
మరొకవైపు దశరథ గురించి, కూతురి గురించి తలుచుకుంటూ దీప ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఎస్ఐ వచ్చి దశరథ కండిషన్ గురించి చెప్పడంతో దీప షాక్ గురైతుంది. మరొకవైపు కార్తీక్ నేను ఒక చోటకి వెళ్లి వస్తాను అని చెప్పి వెళ్తుండగా అమ్మ ఎక్కడికి వెళ్లింది ఎప్పుడు వస్తుంది అంటూ సౌర్య ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. కూతురు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కార్తీక్ అబద్ధాలు చెప్పి కవర్ చేస్తాడు. మరొకవైపు సుమిత్ర ఏమి తినకుండా ఉండడంతో ఇంట్లో వాళ్లు ఇంటికి వెళ్లమని బ్రతిమలాడుతూ ఉండగా ఇంతలో శివన్నారాయణ అక్కడికి వస్తాడు.
వాడికి ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెబుతాడు. జోత్స్న కూడా నా పెళ్లి మా నాన్న చేస్తాడు నాన్నకు ఏమి కాదు మమ్మీ అంటుంది. ఇప్పుడు కొద్దిసేపు నేను కూడా నటించాలి అలా అయితేనే నాకు ఆస్తి వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఇంతలో ఎస్ఐ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పడంతో ఆ దీపంమాత్రం బయటికి రాకూడదు అని కోపంగా అంటుంది సుమిత్ర. దీంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.