Rajinikanth : రజనీకాంత్ కి దాదా సాహేబ్ ఫాల్కే అవార్డ్..!
Rajinikanth : ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి భారతీయ సినిమా పరిశ్రమ. భారతీయ సినిమాకు పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే. ఆయనని తలుచుకుంటూ శతజయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారతీయ సినిమా పరిశ్రమలో ఎనలేని కృషి చేసి, అద్భుత ప్రతిభా పాటవాలను కనబరిచే అతి కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే లభించే అరుదైన గౌరవం ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. నటీనటులు, సంగీత దర్శకులు, ఛాయాగ్రాహకులు, నేపథ్య గాయకులు, పాటల రచయితలు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఒకరని కాదు చలనచిత్రాభివృద్ధికై విశిష్టంగా కృషి చేసిన ఎవరైనా కూడా ఈ అవార్డుకు అర్హులే.

Rajinikanth honoured by DaaDaa saheb phalke award
అలాంటి అరుదైన గౌరవం మన తమిళ సిని సూపర్ స్టారైన రజనీకాంత్ కి దక్కడం అనేది అభినందనీయం. ఇది 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. అంతకు ముందే 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు దాదాసాహేబ్ ఫాల్కే అవార్డ్ ని అందుకోవడం అటు తమిళ, ఇటు తెలుగు ఫాన్స్ లో పట్టలేని ఆనందాన్ని నింపిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక సామాన్య కండెక్టర్ స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అటు కోలివుడ్ ఇండస్ట్రీ లో మకుటం లేని మహా రాజుగా నిలిచాడు. ఒక్క నటన మాత్రమే కాకుండా నిర్మాతగా , స్క్రిప్ట్ వ్రైటెర్ గా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు.
Rajinikanth : రజనీకాంత్ మీద అభినందనల వర్షం..!
తెలుగులో అంతులేని కథ, పెదరాయుడు, అరుణాచలం, నరసింహ, బాబా, చంద్రముఖి, రోబో, కబాలి, కాలా, రోబో 2.0 లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులో తనదైన మార్క్ ని, స్టైల్ ని పరిచయం చేసారు. ప్రతి సినిమాని అంకిత భావంతో చేసి ఎన్నో అవార్డులని, రివార్డులని అందుకున్నారు. తన నటనకు, స్వయం కృషికి ఇప్పుడు మరో గొప్ప అవార్డుని అందుకునే అవకాశం రావడం అటూ సినిమా ఇండస్ట్రీలోని వారికి, ఇటు రాజకీయ వర్గాల వారిని ఆనందానికి గురిచేసింది. అందుకనే సూపర్ స్టార్ రజనీకాంత్ మీద ప్రతీ ఒక్కరు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.