Coolie Movie Review : కూలీ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Coolie Movie Review : కూలీ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :14 August 2025,9:15 am

ప్రధానాంశాలు:

  •  Coolie Movie Review : కూలీ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

coolie movie Review  : భారీ అంచ‌నాల మ‌ధ్య ర‌జ‌నీకాంత్ , లోకేశ్ క‌న‌గ‌రాజ్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న కూలీ చిత్రం ఎన్నో అంచ‌నాల మ‌ధ్య గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌, ఆంధ్ర‌, త‌మిళ‌నాడు లోని కొన్ని ప్రాంతాల‌లో కూలీ సినిమా షోలు ప‌డ‌డంతో ఈ సినిమా చూసిన చాలా మంది సోష‌ల్ మీడియాలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు.

Coolie Movie Review కూలీ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌

Coolie Movie Review : కూలీ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Coolie movie Review  : కూలీ ఫ‌స్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటున్నారంటే..!

కూలీ సినిమా టైటిల్ కార్డు నుంచే లోకి ర‌జినీపై త‌న అభిమానాన్ని చూయించాడ‌ని, ర‌జ‌నీ 50 ఏళ్ల సినిమా లైఫ్‌ని తెలియ‌జేసేలా చాలా ప్ర‌త్యేకంగా అది డిజైన్ చాడ‌ని, అలాగే ఇందులోని న‌టులంద‌రి ఇంట్రో స‌న్నివేశాలు సైతం డిఫ‌రెంట్‌గా మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయ‌ని అంటున్నారు. స‌త్య‌రాజ్ ఆయ‌న‌ కూతురు శృతిహ‌స‌న్ క‌లిసి సైమ‌న్ అక్ర‌మాల‌పై ప్రారంభించిన ఓ మిష‌న్ ఫెయిల్ అవుతున్న స‌మ‌యంలో స‌త్య‌రాజ్ ఫ్రెండ్ ర‌జినీ ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ ఆస‌క్తిక‌ర మ‌లుపులు తిరుగుతుంద‌ని చెబుతున్నారు.

ర‌జ‌నీకి మిత్రుడిగా ఉపేంద్ర ఎంట్రీ, క్లైమాక్స్‌లో అమీర్ ఖాన్ ఆక‌ట్టుకుంటార‌ని చెబుతున్నారు. రెగ్యుల‌ర్ ప్రిడ‌క్ట‌బుల్ స్టోరీనే అయిన‌ప్ప‌టికీ లోకేశ్ మ‌రోమారు త‌న మార్క్ చూయించాడ‌ని టాక్. ఇంకా ప్ర‌చారంలోకి రాని రెండు స‌ర్‌ఫ్రైజ్ క్యామియోలు కూడా ఉన్నాయ‌ని, మౌనికా సాంగ్ విజువ‌ల్‌గా కూడా క‌నుల విందుగా ఉంద‌ని, యాక్ష‌న్ సీన్ల‌న్నీ ది బెస్ట్‌గా డిజైన్ చేశ‌ర‌ని పేర్కొంటున్నారు. ఇక పాలు సోసోగా ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా రేంజ్‌ల‌ను అమాంతం పెంచేలా ఉంద‌ని, బ‌క్కోడు ఇర‌గ‌దీశాడ‌ని పోస్టులు పెడుతున్నారు. నాగార్జున , ర‌జ‌నీల మ‌ధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ అదిరింద‌ని అంటున్నారు.

క‌థ‌:

పోర్ట్‌లో అక్రమ వ్యాపారాలపై ఆధిపత్యం చెలాయించే సైమన్ (నాగార్జున) వద్ద, నమ్మకమైన సహచరుడిగా దయాల్ (సౌబీన్ షాహీర్) ఉంటాడు. ఈ ఇద్దరూ కలిసి ప్రభుత్వానికి, పోలీసులకు చిక్కకుండా తమ పని చక్కగా నిర్వహిస్తుంటారు. అయితే ఈ గ్యాంగ్‌పై పోలీసులు గట్టి అండర్‌కవర్ ఆపరేషన్ మొదలుపెడతారు.ఆ సమయంలో అండర్‌కవర్ పోలీస్ అయిన రాజశేఖర్ (సత్యరాజ్) ను దయాల్ చంపేస్తాడు. రాజశేఖర్ మరణ వార్త విని, అతడి స్నేహితుడు దేవా (రజనీకాంత్) చివరిసారి చూడటానికి వస్తాడు. కానీ, రాజశేఖర్ కూతురు ప్రీతి (శృతి హాసన్) అతడిని అడ్డుకుంటుంది.

ఇక తండ్రి మరణానికి సంబంధించి అసలు మిస్టరీ తెలిసిన దేవా ..ప్రీతి, ఆమె చెల్లెల్ని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ కథలో దయాల్, సైమన్, దేవా మధ్య నడిచే మానసిక యుద్ధం, కుట్రలే సినిమా ప్రధాన ఆకర్షణ.

నటుల ప్రదర్శన ఎలా ఉంది?

రజనీకాంత్ తనదైన స్టైల్, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అద్భుతంగా మెరిశారు. బిల్డప్ సీన్లు, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్‌కి పండుగే! నాగార్జున ‘సైమన్’ అనే విలన్ క్యారెక్టర్‌కి స్టైల్ ఇచ్చినా, డెప్త్ లేదు. అతడి పాత్ర అభివృద్ధి లేకపోవడం వల్ల భావోద్వేగాలు కనెక్ట్ కాలేదు. సౌబీన్ షాహీర్ అయితే అసలైన హీరో అనిపించాడు. ‘దయాల్’ పాత్రలో నటన పరంగా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. సినిమాకు బలం అందించిన మేజర్ కంట్రిబ్యూషన్ అతనిదే.శృతి హాసన్ పాత్రకు ఎమోషనల్ డెప్త్ ఉంది, ఆమె ప్రదర్శన సంతృప్తికరంగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో కనిపించే ఉపేంద్ర, అమీర్ ఖాన్ పాత్రలు ఆకట్టుకున్నా, వారి పాత్రలు మెప్పించలేక‌పోయాయి.

అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ & BGM ఈ సినిమాకు ప్రాణం. చాలా పేలవమైన సీన్లకు కూడా తన స్కోర్‌తో ఊపిచ్చాడు.సినిమాటోగ్రఫీ (గిరీష్ గంగాధరన్) ఔట్ స్టాండింగ్. ప్రతి షాట్‌కు గ్రాండియర్ ఉంది.యాక్షన్ సీన్లు హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. ఖచ్చితంగా థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌కి ప్లస్.

కథలో కొత్తదనం లేదు. మాఫియా, డ్రగ్స్ చుట్టూ తిరిగే పాత ఫార్ములా కథే.స్క్రీన్‌ప్లే నత్తనడక, ఫస్ట్ హాఫ్‌లో బోర్ మూమెంట్స్ ఎక్కువ.నెరేషన్ స్లోగా సాగడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష.

‘కూలీ’ సినిమాకు అసలైన మెయిన్ పాయింట్ రజనీ మాస్, సౌబీన్ యాక్టింగ్, అనిరుధ్ స్కోర్. కథ విషయంలో ఆశించినంతగా మెప్పించకపోయినా, థియేట్రికల్‌గా కొన్ని మాస్ మూమెంట్స్ పని చేస్తాయి. రజనీ అభిమానులు కొంతమేరకు సంతృప్తి పొందగలుగుతారు. కానీ ఓవరాల్‌గా చెప్పాలంటే సినిమా అంత అల‌రించ‌లేక‌పోయింది.

No liveblog updates yet.

LIVE UPDATES

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది