Rajinikanth : శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన రజనీకాంత్.. ప్రపోజ్ చేద్దామనుకున్న సమయంలో..!
ప్రధానాంశాలు:
Rajinikanth : శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన రజనీకాంత్.. ప్రపోజ్ చేద్దామనుకున్న సమయంలో..!
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి అందగత్తె వెనుక ఎంతమంది యువకులు ప్రేమ అనే పేరుతో వెంటపడి ఉంటారు. అందులో స్టార్ హీరోలు సైతం ఉన్నారు అంటే ఆశ్చర్యం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఒకానొక సమయంలో శ్రీదేవిని ఎంతో గాఢంగా ప్రేమించి.. పెళ్లి చేసుకోవాలని భావించారట.

Rajinikanth : శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన రజనీకాంత్.. ప్రపోజ్ చేద్దామనుకున్న సమయంలో..!
Rajinikanth : ఆ కారణం వల్లే..
లెజెండరీ డైరెక్టర్ కె బాలచందర్ ఒక ఇంటర్వ్యూలో రజనీ.. శ్రీదేవికి ప్రపోజ్ చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడని, దానికి కారణం ఒక బ్యాడ్ సెంటిమెంట్ అని చెప్పుకొచ్చాడు. శ్రీదేవి అప్పట్లో తన మొదటి ఇల్లు కొని.. ఎంతో గ్రాండ్ గా గృహప్రవేశం వేడుక నిర్వహించింది. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలు అందరూ విచ్చేశారు. అప్పటికే రజినీ.. శ్రీదేవిని ఎంతో గాఢంగా ప్రేమించాడు. ఇంటి గృహ ప్రవేశం రోజే తన ప్రేమను వ్యక్తపరచాలనుకున్నాడు.
దానికోసం బాగా ప్రిపేర్ కూడా అయ్యాడు. అన్ని అనుకొని శ్రీదేవి ఇంట్లోకి అడుగుపెట్టాలని చూసాడు.. అంతలోనే కరెంట్ పోయింది. ఇల్లంతా చీకటిగా మారింది. అది చూసి షాకయ్యాడు. అది అపశకునంగా భావించి శ్రీదేవికి ప్రపోజ్ చేయకుండా వచ్చాడని, ఆ తర్వాత ఎప్పుడూ కూడా శ్రీదేవి దగ్గర తన ప్రేమను చెప్పలేదని కె బాలచందర్ చెప్పుకొచ్చాడు.రజినీలానే ఎంతోమంది స్టార్ హీరోలు శ్రీదేవి వెనుక పడ్డారు. చివరకు ఆ అతిలోక సుందరి.. బోనీ కపూర్ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. బోనీ – శ్రీదేవికి ఇద్దరు పిల్లలు. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్.