Rakhul preeth singh fired regarding marriage
Rakhul Preeth Singh : ప్రతీసారి అతని గురించి అడగొద్దు అంటూ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఫైర్ అయిపోయింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రకుల్. మహేశ్ బాబు, రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన ఆమెకు మంచి హిట్స్ దక్కాయి. కానీ, ఉన్నపలంగా సౌత్‌లో కెరీర్ స్లో అయిపోయింది. ఫ్లాప్స్ వచ్చినా రకుల్‌కు కాస్త గ్యాప్ తర్వాత మళ్ళీ అవకాశాలు వచ్చేవేమో. తనకి ఉన్న క్రేజ్ అలాంటిది. కానీ, నాగార్జున నటించిన మన్మధుడు 2, క్రిష్ దర్శకత్వంలో చేసిన కొండపొలం కమిటవడం పెద్ద మిస్టేక్.
నితిన్ సరసన నటించిన చెక్ అసలు ఎందుకు చేసిందో కూడా తెలీదు. ఇలా సక్సెస్ కాని స్టోరీలను ఎంచుకొని రకుల్ తన కెరీర్‌ను తానే పాడు చేసుకుంది. అయితే, అమ్మడికి హిందీ ఇండస్ట్రీలో మాత్రం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అరడజనుకు పైగా అక్కడ సినిమాలు చేస్తోంది. మంచి రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఇక రకుల్ కూడా ప్రేమలో ఉంది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో తెలీదు గానీ, తన పెళ్లి కబురు చెప్తుందని మాత్రం ఫ్యాన్స్ గత ఏడాది నుంచి ఎదురు చూస్తున్నారు.
Rakhul preeth singh fired regarding marriage
అయితే, ఇదే విషయంపై రకుల్‌ను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడిగారు. బాలీవుడ్ లో ఆమె నటించిన సినిమాలు రెండు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ సందర్భంగా మీడియా వారు ఇంటర్వ్యూ చేస్తూ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. దాంతో రకుల్ కాస్త ఘాటుగా రియాక్ట్ అయింది. పెళ్లి అనేది చాలా సాధారణ విషయమే. అందరి జీవితంలో ఓ భాగం. అంతేకాదు, అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు ఎలాగో జీవిత భాగస్వామి కూడా అలాగే. ప్రతీసారి అతని గురించి అడగడం ఇబ్బందిగా ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు నేనే స్వయంగా చెప్తాను. అంతేగానీ..ఇలా ప్రతీసారి అతనితో నాకున్న బంధం గురించి మాత్రం అడగొద్దు అని సూటిగానే చెప్పేసింది. మరి రకుల్ ఎందుకు అంత ఫైర్ అయిందో గానీ ఇప్పుడు ఈ కామెంట్స్ మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.