Rakul Preet Singh : ర‌కుల్ ప్రీత్ సింగ్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకోబోతుందా.. అమ్మ‌డికి ఎందుకంత కోపం వ‌చ్చింది

Authored By Sam C | The Telugu News | Updated on : 9 January 2022, 8:30 pm

Rakul Preet Singh : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొడుతున్న ఈ ముద్దుగుమ్మ త్వ‌ర‌లో పెళ్లి పీటలెక్క‌నుంది. త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా బాలీవుడ్ న‌టుడు, నిర్మాత అయిన జాకీ భ‌గ్నానీని పెళ్లి చేసుకుంటున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే నే వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుని ఓ ఇంటివార‌వుతార‌ని వార్తలు నెట్టింట తెగ హల్ చేశాయి. కొంద‌రు ర‌కుల్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటుంద‌ని ప్ర‌చారం చేయ‌గా, దానిపై మండిప‌డింది.నా జీవితానికి సంబంధించిన ఏ ముఖ్యమైన విషయం అయినా నేనే అందరితో పంచుకుంటాను. అంతేకానీ అనవసరంగా అసత్యాలను ప్రచారం చేయకండి అంటూ తెలిపింది రకుల్.

నా చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు నా దృష్టి అంతా వాటిపైనే ఉంది. అందుకే నా గురించి వచ్చే వదంతులను పట్టించుకునే తీరిక నాకు లేదు. ఇక నా జీవితం పట్ల నేను చాలా క్లారిటీగా ఉంటాను.మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకే విధంగా ఉంటుంది. సన్నిహితులకు, స్నేహితులకు మేం ఇచ్చే ప్రాధాన్యత కూడా ఒకేలా ఉంటుంది. అలాగే ఇద్దరం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం… ఉదయాన్నే వ్యాయమం చేయడం వంటి కచ్చితంగా ఫాలో అవుతాం. మా ఇద్దరికీ మధ్య ఇన్ని కనెక్టింగ్ అంశాలు ఉన్నాయి.

Rakul Preet Singh fire on trollers

Rakul Preet Singh fire on trollers

Rakul Preet Singh : ఏది ఉన్నా నేనే తెలియ‌జేస్తానంటున్న ర‌కుల్

అందుకే మేం కనెక్ట్ అయ్యామని అనుకుంటున్నాం అని చెప్పుకొచ్చింది ర‌కుల్. టాలీవుడ్‌లో మ‌హేశ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ వంటి అగ్ర హీరోలంద‌రితో దాదాపు న‌టించారు. అలాగే ఆమె ఓవైపు సినిమాలు, మ‌రో వైపు ఫిట్‌నెస్ రంగంలో రాణిస్తూ బిజీగా కూడా ఉంది. చివ‌రిగా వైష్ణ‌వ్ తేజ్‌తో న‌టించిన కొండ‌పొలం చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp