rakul preet singh : మెగా కోడలితో రకుల్ ప్రీత్ సింగ్‌.. దాని కోసం చేతులు కలిపేసిందిగా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

rakul preet singh : మెగా కోడలితో రకుల్ ప్రీత్ సింగ్‌.. దాని కోసం చేతులు కలిపేసిందిగా!

 Authored By bkalyan | The Telugu News | Updated on :26 February 2021,10:20 am

rakul preet singh : మెగా కోడలు ఉపాసన యువర్ లైఫ్ అనే ఓ మ్యాగజైన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసింతే. మనిషి ఆరోగ్యంగా బతకడానికి చేయాల్సిన పనులు, తినాల్సిన ఆహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ ఉంటుంది. అయితే అలా చెప్పేందుకు ఒక్కో సెలెబ్రిటీని పట్టుకొస్తుంది. వారి జీవితంలో వారు పాటించే నియమాలు ఏంటి? వారి పద్దతులు ఏంటనేది వీక్షకులకు, తన అభిమానులకు చెబుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే సమంత, రష్మిక మందాన్న వంటి వారు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

సమంత వచ్చి.. తన ఆరోగ్య పరిరక్షణకు తీసుకునే జాగ్రత్తలు, తినే ఆహార పద్దతులను వివరించింది. అసలే అర్భన్ ఫార్మింగ్‌లో సమంత రాటు దేలడంతో అన్నీ కూడా సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే తింటుందట. అలా రష్మిక కూడా తమకంటూ ఓ ప్రత్యేకమైన సంప్రదాయ పద్దతులున్నాయని చెప్పుకొచ్చింది. కర్ణాటకలో తమది ప్రత్యేక తెగ అని, తామంతా వైన్, పంది మాంసం తినని రోజు ఉండదని రష్మిక చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

rakul preet singh for upasana ur life 2


rakul preet singh for upasana ur life-2

rakul preet singh : మెగా కోడలితో రకుల్ ప్రీత్ సింగ్‌..

అయితే ఇప్పుడు రకుల్ ప్రీత్ వంతు వచ్చింది. ఉపాసనతో రకుల్ చేతులు కలిసి తమ అభిమానులకు ఆరోగ్య పరిరక్షణ మీద అవగాహన కల్పించేందుకు వచ్చింది. అయితే ఇందులో రకుల్ ఎలాంటి విషయాలను చెప్పిందో చూడాల్సి ఉంది. అసలే రకుల్ అంటే.. ఆరోగ్యవిషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. రోజూ జిమ్, వ్యాయామం అంటూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. మరి అలాంటి రకుల్ తన అభిమానులకు ఎలాంటి సూచనలు ఇచ్చిందో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది