Rakul Preet Singh : ఈ ర‌చ్చేంది ర‌కుల్.. మొత్తం ఆర‌బోస్తున్నావుగా..!

Authored By Sam C | The Telugu News | Published on: February 12, 2022, 1:30 pm

Rakul Preet Singh : గ్లామ‌ర్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇటీవ‌లి కాలంలో సెన్సేష‌న్‌గా మారుతుంది. ఒక‌వైపు బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో అందాల ర‌చ్చ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేసే అందాల ఆర‌బోత‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. ప్ర‌స్తుతం ర‌కుల్ క‌వర్ పేజ్ కోసం గ్లామ‌ర‌స్‌గా ఫొటో షూట్ చేసింది. క్యూట్ లుక్‌లో అందాలు ఆర‌బోస్తూ ఈ ముద్దుగుమ్మ చేసే ర‌చ్చ‌కు ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ఎంత అందంగా ఉన్నావు అంటూ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. ర‌కుల్ పిక్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్న ఈ ముద్దుగుమ్మ ఇలా ఫొటో షూట్స్ చేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్.. బీటౌన్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన 7 సినిమాలు 2022లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో 6 చిత్రాలు బాలీవుడ్‌ మూవీస్‌ కావడం విశేషం. ఛత్రీవాలీ సినిమాలో రకుల్‌ కండోమ్‌ టెస్టర్‌గా కనిపించనున్నట్లు తెలిసిందే. దీంతోపాటు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘రన్‌ వే-34’, అజయ్‌ దేవగణ్‌, సిద్ధార్థ్ మల్హోత్రాలతో ‘థ్యాంక్‌ గాడ్‌’, ఆయుష్మాన్ ఖురానా సరసన ‘డాక్టర్‌ జీ’, అటాక్‌తో పాటు మరొక చిత్రంలో నటిస్తోంది.

rakul preet singh shakes the internet

rakul preet singh shakes the internet

Rakul Preet Singh : ర‌కుల్ క్యూట్ లుక్స్

నేను నటించిన 7 సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. వాటిలో 6 హిందీ చిత్రాలే. ఆ సినిమాలన్నింటిని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాను. ప్రతీ చిత్రం కొత్త జోనర్‌లో తెరకెక్కింది. ‘ఛత్రీవాలీ’లో  టెస్టర్‌ పాత్రను పోషించగా, ‘రన్‌ వే-34’లో ఫైలెట్‌గా కనిపిస్తాను. అలాగే ‘అటాక్‌’ సైన్స్ ఫిక్షన్‌ చిత్రం కాగా, ‘డాక్టర్‌ జీ’లో గైనకాలజిస్ట్‌ రోల్‌ చేస్తున్నాను. గత రెండేళ్లుగా ఈ సినిమాల షూటింగ్‌ జరిగింది. థియేటర్లలో ఈ సినిమాలు ఎప్పుడెప్పుడూ విడుదల అవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.’ అని కూల్‌ బ్యూటీ ఇటీవ‌ల చెప్పుకొచ్చింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp