ఎవరిని తిట్టాలో తెలియక అక్క మీదే అరుస్తాను.. రామ్ చరణ్ కామెంట్స్

Authored By Admin | The Telugu News | Published on: December 23, 2020, 10:00 am

రామ్ చరణ్, తన అక్క హనీ (సుష్మిత), చెల్లి స్వీటీ (శ్రీజ)లతో ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. తాజాగా సుష్మిత, చెర్రీల మధ్య ఉన్న బంధం గురంచి మీడియా ముందు మాట్లాడారు. సుష్మిత వెబ్ సిరీస్‌లు నిరిస్తోన్న సంగతి తెలిసిందే. గోల్డెన్ బాక్స్ అంటూ కొత్తగా ఓ సంస్థను పెట్టి ఓ చిత్రాన్నితెరకెక్కించిన సంగతి తెలిసిందే. షూట్ అవుట్ ఏ లయర్ అంటూ ఓ సినిమాను ప్రేక్షకులకు అందించబోతోంది.

Ram Charan about Sushmita Konidela In Shoot At A Liar Event

Ram Charan about Sushmita Konidela In Shoot At A Liar Event

ఈ మూవీ జీ5 యాప్‌లో రాబోతోంది. ఈ మేరకు నేడు చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఆ ఈవెంట్‌లో సుష్మిత మాట్లాడుతూ రామ్ చరణ్‌తో ఉన్న బంధం గురించి చెప్పుకొచ్చింది. ఈ సినిమాకు రామ్ చరణ్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మరిచిపోలేను.. ఈ సినిమా అనే కాదు.. నా జీవితంలో వచ్చిన ప్రతీ ముఖ్యమైన సంఘటన, కష్టనష్టాల్లో ప్రతీ దాంట్లో నాకు అండగానే నిలబడ్డాడు అంటూ రామ్ చరణ్‌పై ప్రేమను కురిపించింది సుష్మిత.

రామ్ చరణ్ తన అక్క గురించి మాట్లాడుతూ.. మా ఫ్యామిలీ మిమ్మల్ని ఎప్పుడూ ఎంటర్టైన్ చేసేందుకు ఏదో రకంగా ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు అక్క ఇలా వెబ్ సిరీస్‌లతో వస్తోంది. తాను ఎప్పుడూ ఓ ఫైటర్. రంగస్థలం సినిమాకు క్యాస్టూమ్ డిజైనర్‌గా పని చేసింది. మా ప్రొడక్షన్ హౌస్‌లో వచ్చిన మొదటి సినిమా ఖైదీ నెంబర్ 150కి కూడా పని చేసింది.. అయితే సెట్‌లో ఏదైనా జరిగితే మన వాళ్ల మీద అరవలేము.. ఎందుకంటే ఇంటికెళ్లి మళ్లీ మన మొహాలు మనం చూసుకోవాల్సి వస్తుంది.. కానీ డాడీ మాత్రం నన్ను తిట్టేవాడు.. నాకు ఏదైనా కోపం వస్తే.. ఎవరిని తిట్టాలో తెలీక హనీ అక్కనే తిట్టేవాడిని. అన్నీ భరించేది లవ్యూ అక్క అంటూ ఎమోషనల్ అయ్యాడు.

Admin

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp