Ram Charan : జామా మసీదులో రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీ షూటింగ్.. ఎప్పటి నుండి అంటే..!
ప్రధానాంశాలు:
Ram Charan : జామా మసీదులో రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీ షూటింగ్.. ఎప్పటి నుండి అంటే..!
Ram Charan : రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అయింది. దీంతో అందరు కూడా బుచ్చిబాబు సినిమాపై హోప్స్ పెట్టుకున్నారు. కీలకమైన రెండు షెడ్యూల్స్‌ను ముగించినట్టు తెలుస్తుంది. తర్వాతి షెడ్యూల్ ఏప్రిల్‌లో పార్లమెంట్ మరియు జామా మసీదులో చిత్రీకరించబడుతుంది . నిర్మాతలు అవసరమైన అన్ని అనుమతులు పొందినట్లు సమాచారం.

Ram Charan : జామా మసీదులో రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీ షూటింగ్.. ఎప్పటి నుండి అంటే..!
Ram Charan క్రేజీ అప్‌డేట్..
RC16 సినిమాను స్పీడ్‌గా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. బుచ్చిబాబు అందుకు తగ్గట్లుగా జెట్ స్పీడ్‌తో ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారని టీం మెంబర్స్ ద్వారా సమాచారం అందుతోంది.రామ్ చరణ్‌ను రంగస్థలంలోని చిట్టిబాబు తరహా పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు చూపించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పీరియాడిక్ కథతో ఈ సినిమా రూపొందుతోంది.
ఇప్పటికే గురువు సుకుమార్‌కి తగ్గ శిష్యుడు అనిపించుకున్న బుచ్చిబాబు తన రెండో సినిమాగా రామ్ చరణ్‌తో RC16ను చేస్తున్నారు. దాదాపు రెండేళ్లు వెయిట్ చేసి బుచ్చిబాబు ఈ సినిమాను మొదలు పెట్టారు. స్క్రిప్ట్ పై చాలా కాలం వర్క్ చేయడం ద్వారా అద్భుతంగా వచ్చిందని సమాచారం అందుతోంది.బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది.