Ram Charan : రామ్ చరణ్ దీపావళి సెలబ్రేషన్స్.. వెంకటేష్, మహేష్, ఎన్టీఆర్ సందడి..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ram Charan : రామ్ చరణ్ దీపావళి సెలబ్రేషన్స్.. వెంకటేష్, మహేష్, ఎన్టీఆర్ సందడి..!!

Ram Charan : మంచి పై చెడును సాధించిన రోజుగా దీపావళిని జరుపుకుంటాం. ఈ పండుగను చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ఇక ఈ పండుగ అంటే టపాసులు కాలుస్తూ కుటుంబం అంతా ఎంజాయ్ చేస్తారు. ఇక నిన్న ఆదివారం దేశవ్యాప్తంగా ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తాజాగా ఈ దీపావళి గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి […]

 Authored By aruna | The Telugu News | Updated on :13 November 2023,12:00 pm

Ram Charan : మంచి పై చెడును సాధించిన రోజుగా దీపావళిని జరుపుకుంటాం. ఈ పండుగను చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ఇక ఈ పండుగ అంటే టపాసులు కాలుస్తూ కుటుంబం అంతా ఎంజాయ్ చేస్తారు. ఇక నిన్న ఆదివారం దేశవ్యాప్తంగా ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తాజాగా ఈ దీపావళి గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్లోని తమ నివాసంలో ఈ వేడుకలు నిర్వహించినట్లు తెలుస్తుంది. తమ కూతురు క్లీన్ కారకు ఇది తొలి పండుగ కావడంతో రామ్ చరణ్ దంపతులు ఈ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఈ వేడుకకు స్టార్ సెలబ్రిటీలు సందడి చేశారు. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, మంచు లక్ష్మి, సుధీర్ బాబు ఫ్యామిలీ సహా టాలీవుడ్ నటీనటులు ఈ పార్టీలో సందడి చేశారు. విందు భోజనం గేమ్స్ తో అందరూ సరదాగా గడిపారు. అయితే ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలను నమ్రత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నలుగురు హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అభిమానులు ఇది చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు.

శనివారం జరిగిన ఈ పార్టీలో స్టార్ సెలబ్రిటీ లు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే నమ్రత షేర్ చేసిన ఫోటోలలో ఒకే ఫ్రేమ్లో ఎన్టీఆర్, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్ కనిపించారు. ఈ ఫోటో చూసినా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక నమ్రత, లక్ష్మీ ప్రణతి, వెంకటేష్ భార్య నీరజ, ఉపాసనలు ఫోటోలలో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో పై నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హ్యాపీ దీవాలి టాలీవుడ్ స్టార్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక