Ram Charan : రామ్ చరణ్ చేతికి గాయం… అలా కవర్ చేశాడు..! వీడియో
Ram charan : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కుడి చేయికి గాయం అయినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు డ్రగ్స్ కివ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఆ సందర్భంలో చరణ్ తన కుడిచేతిని పూర్తిగా లేపలేకపోయారు.
Ram Charan : రామ్ చరణ్ చేతికి గాయం… అలా కవర్ చేశాడు..! వీడియో
Ram charan : గాయం..
ప్రతిజ్ఞ సమయంలో ఆయన కుడి మోచేయిని షర్ట్‌తో కవర్ చేసుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. దీంతో ఆయన చేతికి గాయం అయి ఉండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, రామ్‌చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా తో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ సందర్భంగా ఆయన గాయపడినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
అయితే అధికారికంగా రామ్‌చరణ్ బృందం గానీ, చిత్ర యూనిట్ గానీ ఈ గాయంపై స్పందించలేదు. అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు .
