Ram Charan : ఆ కథనాయికతో చిరంజీవి తనయుడి ఎఫైర్.. క్లారిటీనిచ్చిన రామ్ చరణ్..
Ram Charan : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘చిరుత’ చిత్రంతో సినీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత రాజమౌళితో ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బాస్టర్ ‘మగధీర’ సినిమా చేశాడు. ఇప్పుడు అదే దర్శకుడితో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేశాడు. ఆ పిక్చర్ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సంగతులు అలా ఉంచితే.. రామ్ చరణ్ తేజ్‌కు ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉందనే వార్తలు వచ్చినపుడు చరణ్ ఎలా స్పందించాడో తెలుసుకుందాం.రామ్ చరణ్ నటించింది తక్కువ సినిమాలే అయినా..
స్టార్ హీరోగా మంచి ఇమేజ్ అయితే సంపాదించుకున్నారు. ఆయన ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్‌లో హీరోగా నటిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ కంప్లీట్ చేసిన చరణ్.. ప్రస్తుతం ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్‌తో ‘ఆర్ సీ 15’ మూవీ చేస్తున్నాడు. మరో వైపున తన తండ్రి చిరంజీవితో ‘ఆచార్య’ పిక్చర్ కంప్లీట్ చేశాడు. ఈ సినిమా వచ్చే నెల 4న విడుదల కానుంది. ఈ సంగతులు పక్కనబెడితే..రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ చాలా క్లీన్ గా ఉంటుంది. కామినేని ఉపాసనను మ్యారేజ్ చేసుకున్న చెర్రీ చాలా హ్యాపీగా ఉన్నాడు. కాగా, ఆయన కెరీర్ స్టార్టింగ్ డేస్ లోనే ఆయనపై చాలా పెద్ద రూమర్ వచ్చింది.

ram charan given Chiranjeevi on his affair with that heroine
Ram Charan : ఆ హీరోయిన్ మినహా మిగతా వారందరితో చెర్రీక్ క్లీన్ ఇమేజ్..!
‘చిరుత’ చిత్రంలో చరణ్‌కు జోడీగా నటించిన నేహాశర్మతో తనకు ఎఫైర్ ఉందని వార్తలొచ్చాయి. నిజానికి వారిరువురి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పైన బాగానే వర్కవుట్ అయింది కూడా. ఈ క్రమంలోనే నేహాశర్మతో చరణ్ కు ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. కాగా, ఈ వార్తపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీనిచ్చాడు చిరు తనయుడు. ఈ వార్త చూశాకే తనకు రూమర్లు అనేవి ఎలా పుడతాయో అర్థమైందని, ఆ తర్వాత ఇలాంటి వార్తలు చూసి తనకు మామూలు విషయం అయిపోయిందని అన్నాడు చరణ్.