Ram Charan : మునుపెన్నడూ చెయ్యని హై ఓల్టేజ్ పాత్రలో కనిపించబోతున్న రామ్ చరణ్

Authored By mallesh | The Telugu News | Published on: February 27, 2022, 2:30 pm

Ram Charan : ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్, తన 15వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అది కూడా క్రియేటివ్ జీనియస్ అయినా శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరమీదకు రాబోతుంది.ఈ సినిమాకు దిల్ రాజ్ నిర్మాత కాగా తన సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియ్రేషన్స్‌లో 50వ చిత్రంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా రామ్ చరణ్ కు మైల్ స్టోన్ మూవీ 15వ సినిమా కావడం ఒక విశేషం. అయితే రామ్ చరణ్ నటించబోయే పాత్ర ఎన్నికల కమిషనర్.ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. కీలక పాత్రల్లో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్ నటించబోతున్నారు.ఈ సినిమా రీసెంట్ గా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రారంభమైంది.

ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. రామ్ చరణ్, కియారాలతో పాటు తదితర నటీనటులు కూడా ఈ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా నెల రోజుల పాటు రాజమండ్రి లోనే సాగనుంది.ఇక దర్శకుడు శంకర్ తన గత చిత్రాల లాగానే రామ్ చరణ్ 15వ సినిమాను కూడా ఓ సామాజిక అంశాన్ని ఆధారంగా తీసుకొని హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందించనున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ ఎన్నికల కమీషనర్‌గా కనిపించగా. ఇక ఈ సినిమాలో సీయం పాత్రలో తమిళ దర్శకుడు, నటుడు ఎస్. జే.సూర్య నటించబోతున్నారు.అయితే శంకర్ – అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ఒకే ఒక్కడు సినిమాలోలాగానే ఎన్నికల కమీషనర్‌కు సీయం కు మధ్య వచ్చే ఇగో క్లాష్ నేపథ్యంలోనే ఈ సినిమా కథ కూడా ఉండబోతుందని సినీ వర్గాల్లో టాక్ గా వినిపిస్తోంది.

Ram Charan Green Signal for New Movie

Ram Charan Green Signal for New Movie

Ram Charan : రాజమండ్రిలో షూటింగ్

అయితే ముందునుంచి రామ్ చరణ్ 15వ సినిమాలో శ్రీకాంత్ విలన్ అనే వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు విలన్ గా సూర్య అని చెప్పుకుంటున్నారు. యస్.జే.సూర్య నటిస్తున్న సీయం పాత్రే చరణ్ 15 వ సినిమాలో మెయిన్ విలన్ అని సినిమా వర్గాల సమాచారం. ఇంతకముందు సూర్య సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ సినిమా లో సైకో విలన్ గా పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నాడు సూర్య. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ అయినా హీరో దళపతి విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమాలోనూ విలన్‌గా సూర్య నటించి ప్రేక్షకుల ప్రశంసలను పొందారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న 15వ చిత్రంలో మెయిన్ విలన్ గా నటించనున్న సూర్య పాత్ర ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.

mallesh

No bio available for this author.

  1. "Driving Licence : మొబైల్ నంబర్ అప్డేట్ చేయకపోతే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందా..?"

  2. "Bathing Dinner : భోజనం చేసిన వెంటనే వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది? నిజం ఇదే"

  3. "Radhika Apte : 41 ఏళ్లలోనే నా శరీరం, కోరికలపై అసలైన క్లారిటీ వచ్చింది: రాధికా ఆప్టే"

  4. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  5. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  6. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  7. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp